HanuMan జై హనుమాన్‌లో మెగా హీరో.. హనుమంతుడికి మాట ఇచ్చిన శ్రీరాముడి పాత్రలో ఎవరంటే?

ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తున్న పేరు హనుమాన్. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేశారో రివిల్ చేయలేదు. కానీ సెకండ్ పార్ట్ ఉంటుందని జై హనుమాన్ అంటూ చెప్పుకువచ్చారు. అయితే ఈ జై హనుమాన్ చిత్రంలో మెగా హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ పెద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. తెలుగులో 'సూపర్‌ మ్యాన్' జోనర్ చిత్రాలు రావడం చాలా రేర్.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రంతో ఆ లోటును తీర్చాడు. అంతే కాదు.. సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తుంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Mega Hero Ram Charan To Play as ShriRam in Jai HanuMan News Goes Viral

ఇక తేజ సజ్జా పాత్ర, అతని యాక్టింగ్ కు చాలా మంది ఫిదా అయిపోతున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన సినిమాను ప్రశాంత్‌ వర్మ తీశాడంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూలు చేసి.. దూసుకుపోతుంది హనుమాన్. ఈ సంక్రాంతికి నాలుగు చిత్రాలు రాగా... అందులో ఈ చిత్రమే సంక్రాంతి విజేతగా నిలిచింది. పెద్ద హీరోలను సైతం పక్కకు నెట్టి హనుమాన్ సూపర్ హిట్టుగా నిలిచింది.

ఇక ఈ సినిమా ఎండ్ కార్డులో సీక్వెల్ ను అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ పేరుతో పార్ట్ 2.. 2025లో ఉంటుందని తెలిపాడు. అయితే హనుమంతుడికి శ్రీరాముడు ఇచ్చిన మాట ఏంటి అనేది ట్విస్టుతో ముగించాడు. బహుబలి రేంజులో ఈ ట్విస్ట్ పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఆ శ్రీరాముడి పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆ పాత్రలో మెగా హీరో నటించబోతున్నట్లు సమాచారం.

Mega Hero Ram Charan To Play as ShriRam in Jai HanuMan News Goes Viral

జై హనుమాన్ చిత్రంలో మెగా హీరో రామ్ చరణ్.. శ్రీరాముడి పాత్రలో నటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఇన్ సైడ్ టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... రాముడి పాత్రకు రామ్ చరణ్ బాగా సూట్ అవుతారాని అంటున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లురి సీతారాముడిగా కనిపిస్తే.. నార్త్ జనాలంతా అల్లాడి పోయారు. ఇప్పుడు ఏకంగా రాముడి పాత్రలో కనిపిస్తే... తట్టుకోగలరా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరి నిజంగానే రాముడి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తే.. ఫ్యాన్సుకు మాత్రం పండగే అని చెప్పవచ్చు. ఇక హనుమంతుడు ఎవరు అనేది చూపించలేదు. మరి హనుమంతుడు పాత్రలో చిరంజీవి కనిపిస్తే బాగుండని కామెంట్స్ వినిపిస్తున్నాయి. హనుమాన్ చిత్రంలో హనుమాన్ కళ్లను చూపించారు. ఆ కళ్లు చిరంజీవివే అంటూ ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు తండ్రి కొడుకుల ఇలా ఒకే చిత్రంలో రాముడు, హనుమాన్ గా కనిపిస్తే... బాగుండని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X