twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'లెజెండ్‌' ని చూడబోతున్న మెగా హీరో

    By Srikanya
    |

    హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రం శుక్రవారం విడుదలై మాస్ తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్ ను కూడా ఆకట్టు కుంటూ ముందుకు దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ త్వరలో చూడనున్నారని సమాచారం. బోయపాటి శ్రీనుతో తన తదుపరి చిత్రం చేయటానికి సిద్దమవుతున్న రామ్ చరణ్, ఈ చిత్రం ప్రింట్ తెప్పించుకుని చూస్తారని తెలుస్తోంది. అదే సమయంలో చిరంజీవి కూడా ఈ చిత్రం చూసే అవకాసం ఉంది.

    దుర్గా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం బోయపాటి తొలి చిత్రం 'భధ్ర' కి సీక్వెల్ లాంటి కథ అని ఫిల్మ్ నగర్ సమాచారం. సింహా తరహాలోనే లెజండ్ కథ ఉన్నా ట్రీట్ మెంట్ లో తేడా చూపించి హిట్ కొట్టినట్లే భధ్ర తరహా కథని కొద్దిగా మార్చి లవ్ స్టోరీకి ప్రాధాన్యత ఇచ్చి రామ్ చరణ్ తో చేయటానికి ఫిక్స్ అయ్యాడని చెప్తున్నారు. ఈ కథకు చిరంజీవి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు.

     Mega Hero Ram Charan To Watch Legend?

    అంతేకాకుండా రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వరస హిట్స్ తో దూసుకుపోతున్న శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆయన తన నెక్స్ట్ చిత్రం చేయనున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ,శ్రీను వైట్ల కాంబినేషన్ అని వార్తలు వస్తున్నప్పటికీ రామ్ చరణ్ తోనే అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్ధ ఈ చిత్రం నిర్మించనుంది. ఈ మేరకు శ్రీను వైట్ల స్క్రిప్టు వర్క్ ప్రారంభించాడని అంటున్నారు. యాక్షన్ తో కూడిన కామెడీగా చిత్రం రూపొందనుంది. ఆగడు షూటింగ్ పూర్తైన వెంటనే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.

    ప్రస్తుతం కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ లో రెగ్యులర్ గా రామ్ చరణ్ పాల్గొంటున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా ఓ కుటుంబ కథా చిత్రం తెరకెక్కుతోంది. కాజల్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్‌ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్‌ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్‌ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ''అన్నారు.

    English summary
    Ram Charan is supposedly planning to watch Legend in a couple of days. Though Boyapati's next film with Ram Charan has been green lit by Chiranjeevi. This film with Ram Charan is going to be a romantic family entertainer in the lines of Boyapati's first film Bhadra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X