సూసైడ్ చేసుకోవాలనకున్న మెగా హీరో.. ఆ అమ్మాయే కారణం.. కానీ పవర్ స్టార్ ఎంట్రీతో!

ఆ మధ్యలో బైక్ యాక్సిడెంట్ వల్ల చాలా కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకున్న మెగా హీరో సాయితేజ్.. దాదాపు చావు అంచులకు వరకు ‌వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన గతంలో ఓ సారి సూసైడ్ చేసుకోవాలనుకున్నారట. అవును ప్రస్తుతం ఈ విషయం గురించి బయట వార్తలు వస్తున్నాయి. వివరాళ్లోకి వెళితే...

మెగా మేనల్లుడిగా.. :పిల్ల నువ్వు లేని జీవితం చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్... తొలి చిత్రంతోనే తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. మధ్యలో సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంతో ఓ కమర్షియల్ హిట్ ను అందుకుని ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. అలా మెగా కంపౌండ్ నుంచి వచ్చిన మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలో రాణిస్తూ సుప్రీం హీరోగా ఎదిగారు.

Mega Hero Sai Dharam Tej failed in love and wanted to commit suicide news viral in social media

విరూపాక్షతో సక్సెస్... :అయితే ఈ ఏడాది విరూపాక్ష చిత్రంతో సాయి తేజ్ భారీ హిట్ ను అందుకున్నారు. కెరీర్ ఆయనకు ఇదే తొలి బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. లెక్కల మాస్టారు సుకూమార్ శిష్యుడు కార్తిక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలా చాలా రోజుల తర్వాత మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం తన మేనమావ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా బ్రో చేశారు. ఇది మరో ఐదు రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారాయన.

Mega Hero Sai Dharam Tej failed in love and wanted to commit suicide news viral in social media

షాకింగ్ విషయం... :ఇటువంటి ఆయనకు సంబంధించి ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. సాయి తేజ్ ఓ తప్పు చేసేందుకు ప్రయత్నించారట. చదువుకునే రోజుల్లో చాలా మంది యూత్ లాగే ఆయన చేయబోయారట. అదే ప్రేమించడం.. అవును మీరు చదివింది నిజమే. బయటు ఇప్పుడు ఇవే కథనాలు కనిపిస్తున్నాయి. సాయి తేజ్ చదువుకునే రోజుల్లోనే ఓ అమ్మాయిని బాగా ఇష్టపడ్డారట. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే.. అది కుదరలేదట. అమ్మాయికి వేరే పెళ్లి అయిపోయిందట.

Mega Hero Sai Dharam Tej failed in love and wanted to commit suicide news viral in social media

గతాన్ని మరిచి... :ఇక ఈ విషయం తెలిసుకున్న సాయి ధరమ్ తేజ్ తట్టుకోలేకపోయారు. దీంతో ఆ అమ్మాయిని మర్చిపోలేక ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడం వల్ల దాన్ని విరమించుకున్నారట. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణించారట. ప్రస్తుతం గడిచిపోయిన గతాన్ని మర్చిపోయి సినిమాలు చేసుకుంటూ హాయిగా ఉంటున్నారు.

Mega Hero Sai Dharam Tej failed in love and wanted to commit suicide news viral in social media

సినిమాలకు బ్రేక్..:ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. పవన్ కల్యాణ్ తో బ్రో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఓ షార్ట్ ఫిలిం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఏడాది పాటు సాయి ధరమ్ తేజ్ సినిమాలకు గ్యాప్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. గతంలో తేజుకు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఆ ట్రీట్ మెంట్ కోసమే తేజు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X