రీమేక్ కథతో పవర్ స్టార్ మల్టీస్టారర్.. సిద్ధమైన మరో మెగా హీరో?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత కొన్నాళ్ళుగా మల్టీస్టారర్ సినిమాలు బాగానే వస్తున్నాయి. మంచి కథ సెట్టయితే నేటితరం హీరోలు మరో హీరోతో వర్క్ చేయడానికి ఏ మాత్రం సందేహించడం లేదు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న మల్టీస్టారర్ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక కొత్త తరహా మల్టీస్టారర్ రానున్నట్లు టాక్ వస్తోంది.

పవర్ స్టార్ మరో రీమేక్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ బాలీవుడ్ పింక్ రీమేక్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ అంటూ ఆడియెన్స్ ని తనదైన శైలిలో ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఇటీవల మరో రీమేక్ కథకు కూడా పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాలో పవర్ స్టార్ నటించే ఛాన్స్ ఉందట.

నిజమైన పవర్ స్టార్..
డ్రైవింగ్ లైసెన్స్ అనే కథలో పృథ్వి రాజ్ హీరోగా నటించాడు. ఒక అభిమానికి స్టార్ హీరోకి జరిగే యుద్ధమే ఈ సినిమా కధ. ఆర్టీవోకి చెందిన ఓక అధికారి తన అభిమాన హీరోను ఒక వివాదంలో ఎలా ఎదుర్కొన్నాడు అనే విదంగా ఈ సినిమా కథ నడుస్తుంది. అయితే ఈ కాన్సెప్ట్ లో పవన్ కళ్యాణ్ నిజమైన స్టార్ హీరోగా కనిపించనున్నాడట. ఇది ఎంతవరకు సెట్టవుతుందనేది హాట్ టాపిక్ గా మారింది.

మరో మెగా హీరో..
అసలు మ్యాటర్ లోకి వస్తే.. మరో కథానాయకుడిగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అభిమాని పాత్రలో సాయి ధరమ్ తేజ్ తన చిన్న మామయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో సూరజ్ వెంజరమూడు అభిమాని పాత్రలో కనిపించాడు. ఆ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.
Recommended Video

నిజమేనా?
మంచి దర్శకుడు సెట్టయితే గనక సినిమా అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. రూమర్స్ అయితే బాగానే వస్తున్నాయి. మరి పవన్ ఏ విధంగా ఆలోచిస్తాడో చూడాలి. పింక్ సినిమా అయిపోగానే పవర్ స్టార్ క్రిష్ సినిమాతో పాటు హరీష్ శంకర్ ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయనున్నాడు.


Click it and Unblock the Notifications