మెగా ఫ్యామిలీలో మరో వేడుక: పెళ్లికి సిద్ధమైన యంగ్ హీరో.. ఆ అమ్మాయితోనే.. ముహూర్తం ఎప్పుడంటే?

మెగా ఫ్యామిలీలో మరో వేడుకకు రంగం సిద్ధమైందా? ఆ కుటుంబానికి చెందిన యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా? ఇప్పటికే పెళ్లి సంబంధం కూడా ఫిక్స్ అయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిహారిక పెళ్లి సందడి చేసిన మెగా కుటుంబం.. ఇప్పుడు మరోసారి ఒక్కచోటుకు చేరబోతుందట. ఇంతకీ ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారా? అదేనండీ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించే ఈ వార్త. అవును.. ఈ యంగ్ హీరో వివాహం ఖరారైందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, అమ్మాయి వివరాలూ లీకయ్యాయి. ఆ విశేషాలు మీకోసం!

బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. కష్టంతో స్టార్‌డమ్

బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. కష్టంతో స్టార్‌డమ్

మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఆరంభంలోనే కొన్ని విజయాలను అందుకున్న అతడు... కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించుకుంటున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతున్నాడు. తద్వారా స్టార్‌డమ్‌ను అందుకున్నాడు.

పరిచయం అలా.. వరుస ప్లాపులతో ఢీలా

పరిచయం అలా.. వరుస ప్లాపులతో ఢీలా

వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన 'రేయ్' సినిమాతో పరిచయం అవ్వాల్సి ఉన్నా.. అది అనివార్య కారణాలతో వాయిదా పడడంతో 'పిల్లా నువ్వు లేని జీవితం' ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

వరుస విజయాలతో సత్తా.. హ్యాట్రిక్‌ కూడా

వరుస విజయాలతో సత్తా.. హ్యాట్రిక్‌ కూడా


వరుస పరాజయాలతో సతమతం అవుతున్న తరుణంలో సాయి ధరమ్ తేజ్ 'చిత్రలహరి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. దీని తర్వాత మారుతి డైరెక్షన్‌లో వచ్చిన 'ప్రతిరోజూ పండగే'తో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఇక, ఇటీవలే 'సోలో బ్రతుకే సో బెటర్'తో వరుసగా మూడో హిట్‌ను అందుకున్నాడు.

పెళ్లిపై ప్రచారం... ఇప్పుడు నిజమేనంటూ

పెళ్లిపై ప్రచారం... ఇప్పుడు నిజమేనంటూ


టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లుగా ఉన్న హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకడు. అందుకే అతడి వివాహం గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే, ఈ సారి మాత్రం ఈ సుప్రీమ్ హీరో నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని సమాచారం.

ఇప్పుడు కుదరదు.. ఆ నెలలోనే వివాహం

ఇప్పుడు కుదరదు.. ఆ నెలలోనే వివాహం


సాయి ధరమ్ తేజ్ వివాహానికి రంగం సిద్ధం అయినట్లు జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతడి పెళ్లి జరగబోయే తేదీ గురించి కూడా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. సాయి ధరమ్ తేజ్ పెళ్లి మే నెలలో జరగబోతుందట. వాస్తవానికి అంతకు ముందే ఈ వేడుక జరగాలని అనుకున్నా.. మంచి ముహూర్తాలు లేవని అలా డిసైడ్ అయ్యారట.

ఆ అమ్మాయితోనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి

ఆ అమ్మాయితోనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి

ఇక, సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరన్న దానిపై పెద్దగా స్పష్టత అయితే రావడం లేదు. కానీ, ఇండస్ట్రీకి చెందిన యువతి అయితే కాదని క్లియర్‌గా తెలుస్తోంది. అంతేకాదు, హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త డాటర్ అని ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా పెద్దలు కుదర్చిన వివాహమేనని అంటున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

వాళ్లంతా మళ్లీ.. మేనమామల చేతుల మీదే

వాళ్లంతా మళ్లీ.. మేనమామల చేతుల మీదే

నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లికి కూడా వాళ్లంతా వస్తారని అంటున్నారు. అంతేకాదు, ఈ వేడుక మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ చేతుల మీదుగానే జరగనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా సుప్రీమ్ హీరోను పెళ్లికి ఒప్పించింది మెగాస్టార్ అని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X