ఆ ట్విస్ట్ క్లిక్కయితే ఉప్పెన ట్రెండ్ సెట్ చేసినట్లే..
ఏ హీరోకైనాక్ మొదటి సినిమా అనేది కెరీర్ కు చాలా కీలకమైనది. ఇక అగ్ర హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలైతే ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అయితే మెగా హీరో మాత్రం భారీ రిస్క్ తో కూడిన కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమాపై ఓ వర్గం ఆడియేన్స్ లో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి.
అయితే ఆ సినిమో ఒక ట్విస్ట్ చాలా కీలకమాట. సినిమా మూడ్ ను మొత్తం ఒక్కసారిగా చేంజ్ చేసే ఆ ట్విస్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా కూడా చా కష్టమని రూమర్స్ వస్తున్నాయి. విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అతని కూతురినే హీరో ప్రేమిస్తాడట. అయితే సినిమాలో కొంతవరకు రొటీన్ ఫార్ములా అయినప్పటికీ హిరోకు విలన్ కలిగించే నష్టం ఊహించని విధంగా ఉంటుందట.

ఇప్పటివరకు తెలుగులో అలాంటి ట్విస్ట్ ఎవరు చూసి ఉండరని రూమర్స్ వస్తున్నాయి. సినిమా కథను ఓకే చేయడానికి కారణం కూడా అదేనట. దర్శకుడు సుకుమార్ అందించిన స్క్రిప్ట్ కాబట్టి ట్విస్ట్ బలంగా ఉంటుందని చెప్పవచ్చు. కుమారి 21Fలో చివరలో ఇచ్చిన ట్విస్ట్ కూడా ఆడియెన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. ఇక ఉప్పెనలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి. ఇక సినిమాను జనవరిలో కాకుండా సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











