Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగా హీరో ఉప్పెన.. ఈ సారి ఫిక్స్ అయినట్లే..
మెగాఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం కాబోతున్న వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాను ఏ క్షణాన ఓకే చేశాడో గాని విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. సినిమాకు హైప్ మాత్రం బాగానే ఉంది. ఒక్క సాంగ్ తో దేవిశ్రీప్రసాద్ పవర్ఫుల్ బజ్ క్రియేట్ చేశాడు. నీ కన్ను నీలి సముద్రం సాంగ్ ఏకంగా 150మిలియన్ వ్యూవ్స్ ను అందుకుంది.
ఆ ఒక్క పాటతోనే ఉప్పెనలా అంచనాలు పెరిగిపోయాయి. అందుకే సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో అంచనాల డోస్ కూడా పెరిగింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారు.
వీలైనంత వరకు రిలీజ్ ను ఫిబ్రవరి 5నే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓటీటీలో ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడంతో ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక సంక్రాంతి రావాలని అనుకున్నారు గాని థియేటర్స్ కు 100% ఆక్యుపెన్సీతో నడిచే వరకు విడుదల చేయకూడదని మళ్ళీ వెనక్కి తగ్గారు. మరి ఫిబ్రవరిలో పరిస్థితులు మళ్ళీ యధావిధిగా ఉంటాయో లేదో చూడాలి మరి.