మెగాస్టార్ చిరంజీవి సినిమాలో వరుణ్ తేజ్.. మొదటి సారి పవర్ఫుల్ పాత్రలో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల అనంతరం వరుసగా మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్టార్ ఇమేజ్ ను కాస్త పక్కనపెట్టి మన హీరోలు ఎలాంటి విబేధాలు లేకుండా మల్టీస్టారర్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడం మంచి వాతావరణం క్రియేట్ అవుతోంది. ఇక మెగాస్టార్ - వరుణ్ తేజ్ కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మల్టీస్టారర్ కాదు గాని వరుణ్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

 ఆచార్య అనంతరం అదే సినిమా

ఆచార్య అనంతరం అదే సినిమా

మెగాస్టార్ చిరంజీవి లైనప్ చూస్తే నేటితరం యువతరం హీరోల కంటే కూడా హై వోల్టేజ్ తో ఉంది. రానున్న రోజుల్లో చిరంజీవి ఏ మాత్రం గ్యాప్ లేకుండా హార్డ్ వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆచార్య అనంతరం మెగాస్టార్ ఫోకస్ మొత్తం లూసిఫర్ పైనే ఉండనుంది. ఇక ఆ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

తండ్రి కోసం రామ్ చరణ్

తండ్రి కోసం రామ్ చరణ్

మళయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన లూసిఫర్ 100కోట్లను అందికుంది. అందులో మోహన్ లాల్ చేసిన పవర్ఫుల్ పాత్రతో మరింత మ్యాజిక్ క్రియేట్ చేయవచ్చని రామ్ చరణ్ తండ్రి కోసం రీమేక్ హక్కులను తీసుకున్నాడు. మోహన్ రాజాకు డైరెక్షన్ బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే.

 వరుణ్ తేజ్ కీలక పాత్రలో..

వరుణ్ తేజ్ కీలక పాత్రలో..

ఇక ఆ సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆ సినిమాలో మరొక మెగా హీరో కూడా పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నట్లు టాక్ వస్తోంది. అతనెవరో కాదు. యువ హీరో వరుణ్ తేజ్. తనకంటూ ఒక ప్రత్యేకమైన క్లాస్ ఇమేజ్ తో ముందుకు వెళుతున్న వరుణ్ తేజ్ మెగాస్టార్ తో ఛాన్స్ వస్తే నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు.

Recommended Video

Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
 విజయ్ దేవరకొండ నుంచి వరుణ్ తేజ్ వద్దకు?

విజయ్ దేవరకొండ నుంచి వరుణ్ తేజ్ వద్దకు?

ఇక లూసిఫర్ కథలో విదేశాల నుంచి వచ్చి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడే యువకుడి పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తాడని సమాచారం. మలయాళంలో ఆ పాత్రను టోవినో థామస్ చేశాడు. ఇక మొదట ఈ పాత్ర కోసం విజయ దేవరకొండను సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు దర్శకుడు వరుణ్ తేజ్ పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ తో చర్చలైతే జరుగుతున్నాయట. మరి వరుణ్ తేజ్ సినిమాలో ఉంటాడో లేదో తెలియాలి అంటే సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X