ఇంట్రెస్టింగ్: అల్లు బాబీ టాలీవుడ్ ఎంట్రీ.. మెగా హీరోల్లో పెరిగిన పోటీ

By Manoj Kumar P

ప్రస్తుతం ఉన్న మెగా హీరోల్లో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించుకుంటున్నాడు వరుణ్ తేజ్. 'ముకుంద' ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ యంగ్ హీరో.. ఆ తర్వాతి చిత్రానికే జాతీయ అవార్డుతో మెరిశాడు. మధ్యలో కమర్షియల్ చిత్రాలతో ఫ్లాపులను చవి చూశాడు. ఈ క్రమంలోనే నటనకు ఆస్కారమున్న పాత్రలు చేసి విజయవంతం అయ్యాడు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపుతూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్‌స్టర్‌కు అల్లు బాబీ రూపంలో కష్టాలు వచ్చి పడ్డాయట. వాళ్ల ధాటికి వొళ్లు హూనం చేసుకుంటున్నాడని తెలిసింది. వివరాల్లోకి వెళితే...

సరికొత్త ప్రయోగంతో సక్సెస్ అయ్యాడు

సరికొత్త ప్రయోగంతో సక్సెస్ అయ్యాడు

వరుణ్ తేజ్ ఇటీవల ‘గద్దలకొండ గణేష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్లనూ అదే స్థాయిలో రాబట్టింది. ముఖ్యంగా ఇందులో అతడి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇందులో వరుణ్ సరసన పూజా హెగ్డే నటించగా, తమిళ నటుడు అధర్వ కీలక పాత్ర చేశాడు.

ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు స్టార్ట్ చేశాడు

ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు స్టార్ట్ చేశాడు

భారీ హిట్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం ఉన్న సినిమాలో చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వాస్తవానికి ఎప్పుడో చేయాలి. కానీ, దీనిని ఆపేసి హరీశ్ శంకర్‌తో ‘గద్దలకొండ గణేష్' చేశాడు. ఈ సినిమా కోసం విదేశాలకు వెళ్లి శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.

అల్లు బాబీ ఎంటర్ అవుతున్నాడు

అల్లు బాబీ ఎంటర్ అవుతున్నాడు

ఈ సినిమా ద్వారా అల్లు అరవింద్ కుమారుడు బాబీ సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నాడు. వాస్తవానికి గతంలో పలు చిత్రాల ప్రొడక్షన్ పనులను పర్యవేక్షించిన ఆయన.. దీనికి మాత్రం తండ్రితో కలిసి నిర్మాతగా మారాడు. అందుకే ఈ సినిమాను గ్రాండ్‌గా తీయాలని ఆయన భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అల్లు బాబీ కోసం హాలీవుడ్ టెక్నిషియన్

అల్లు బాబీ కోసం హాలీవుడ్ టెక్నిషియన్

తన నిర్మాణంలో వస్తున్న మొదటి సినిమా కావడంతో అల్లు బాబీ.. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం హాలీవుడ్‌కు చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్ లార్నెల్ స్టోవల్‌ను తీసుకు వచ్చాడు. గతంలో ఈయన సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్'తో పాటు పలు హాలీవుడ్ చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేశాడు.

చమటోడుస్తున్న వరుణ్

చమటోడుస్తున్న వరుణ్

వాస్తవానికి గతంలో అమెరికా వెళ్లి మరీ వరుణ్ తేజ్ లార్నెల్ దగ్గరే శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు అల్లు బాబీ కోరికపై ఆయన హైదరాబాద్ వచ్చి బాక్సింగ్స్ సీన్స్ కంపోజ్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే వరుణ్‌కు ప్రాక్టీస్‌ ఇస్తున్నాడు. రోజులో ఎక్కువ భాగం దీనికే కేటాయిస్తున్నారని తెలిసింది. దీంతో ఈ మెగా హీరో వొళ్లు హూనం అయిపోతుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X