Lavanya Tripathi : షాకింగ్.. అప్పుడే తల్లి కాబోతున్న మెగా కొత్త కోడలు... కానీ ఫీలవుతున్న ఫ్యాన్స్!
టాలీవుడ్ ఇండస్ట్రీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సందడి చేశారు. అయితే పెళ్లైన మూడు నెలలకే ఆమె తల్లి కాబోతున్నట్లు తెలిసింది. కానీ ఇందులో ఓ చిన్న ట్విస్ట్ కూడా దాగి ఉండటం విశేషం. దాని గురించే ఈ కథనం.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'అందాల రాక్షసి'తో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ సరికొత్త కథలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇక హోమ్లీ యాటిట్యూడ్ బాగా మెయిన్‌టెయిన్ చేస్తుంది. ఆఫ్ స్క్రీన్‌లోనూ ట్రెడిషనల్‌గా ఉంటుంది. ఒకవేళ వెస్టర్న్ వేర్లో కనిపించినా అందాలు ఆరబోయడంలో హద్దులు దాటదు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్‌ను పెళ్లి మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఆ కొంచెం కూడా కనిపించే అవకాశం ఉండదు. 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరు ఆ సినిమాల షూటింగ్ జర్నీలో ప్రేమలో పడి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

లావణ్య ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లోనూ ఇన్వాల్వ్ కాలేదు. ఇక ఆన్‌స్క్రీన్‌లో హీరోయిన్గా ఛాన్స్‌లు కాస్త తగ్గినప్పటికీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తూ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. రీసెంట్గా కూడా 'మిస్ పర్ఫెక్ట్' సిరీస్‌తో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఆమె తల్లి కాబోతుందట. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్. రీల్ లైఫ్‌లో అట.
ఈ సినిమా మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కనుందని అంటున్నారు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి స్టార్ హీరో చిన్నప్పటి పాత్రకు తల్లిగా కనిపించనుందని టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకమని అంటున్నారు. అందుకే లావణ్య త్రిపాఠి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. ఇక ఇది తెలుసుకుంటున్న మెగా ఫ్యాన్స్ లావణ్య రియల్ లైఫ్‌లో ఆ గుడ్ న్యూస్ చెప్తే బాగుండు అని ఆశపడుతున్నారు. కానీ సినిమాలో హీరోకు తల్లి పాత్ర అని తెలిసి కాస్త ఫీలవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తెగ కామెంట్లు చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

మరోవైపు, వరుణ్ తేజ్ కూడా తన కొత్త సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటించిన 'ఆపరేషన్ వాలంటైన్' తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రంలో వరుణ్‌కు జోడీగా మానుషి చిల్లర్ నటించింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న రానుంది.


Click it and Unblock the Notifications











