నాగైచైతన్య ఆఫర్స్ ని నొక్కేస్తున్న మెగా హీరోలు

By Srikanya

నాగచైతన్య సినిమాలు వరసగా మెగా హీరోల కాంపౌండ్ లో కి చేరిపోతున్నాయి. తాజాగా గౌరవం చిత్రం ఇక త్వరలో ప్రారంభమవుతుంది అనుకుంటూండగా...అల్లు శిరీష్ లాంచింగ్ సినిమాగా మారిపోయింది. అలాగే..నాగచైతన్యతో అనుకున్న కేరింత చిత్రం సైతం మెగా కాపౌండ్ లో కొత్తగా ప్రవేశించిన సాయి ధరమ్ తేజ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక తాజాగా వీరూ పోట్ల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా అనుకున్న చిత్రం కూడా అల్లు అర్జున్ దగ్గరకి వెళ్ళనుందని సమాచారం.

ఇక ఒక్కో సినిమా నాగచైతన్య నుంచి జారిపోవటానికి రకరకాల కారణాలు వినపడుతున్నాయి. నాగచైతన్య తొందరగా తేల్చటం లేదని చెప్తున్నారు. అదే మెగా కాంపౌండ్ లో అయితే కథ చెప్పి నచ్చితే మిగతావి స్పీడుగా జరుగుతాయంటున్నారు. నాగచైతన్య వరస ప్లాపులతో కన్పూజన్ లో ఉండి యాక్షన్ సినిమాలు అని కాస్సేపు,ఫ్యామిలీ సినిమాలు అని కాసేపు,ప్రేమ కథా చిత్రాలను కాస్సేపు ఊగిసలాడి ఆఫర్స్ పోగొట్టుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం నాగచైతన్య...దేవకట్టా దర్సకత్వంలో రూపొందుతున్న ఆటో నగర్ సూర్య లో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్ధానం చిత్రంతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు దేవకట్టా కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి.నిర్మాత సైతం ఈ చిత్రంపై మంచి కాన్పిడెన్స్ గా ఉన్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ అవుతోంది.

అలాగే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య... ఈ ముగ్గురు హీరోలుగా ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమాకి 'త్రయం' అనే పేరును పరిశీలిస్తున్నారు. వాల్ట్‌డిస్నీ, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విక్రమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తారు. ఈయన ఇటీవల విడుదలైన 'ఇష్క్‌' చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల కథానాయకుల్ని ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు.పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రహణం సమకూరుస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X