బోయపాటికి ఆ హీరోలు షాకిచ్చారా? అల్లు అరవింద్ ఎందుకలా చెప్పారు?

Recommended Video

Mega Hero's Not Interested In Boyapati Srinu-Allu Aravind Movie || Filmibeat Telugu

బోయపాటి శ్రీను.. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ మాస్ డైరెక్టర్.. ప్రస్తుతం మాత్రం దేనినీ పట్టాలెక్కించలేదు. గత సంక్రాంతి కానుకగా విడుదలైన 'వినయ విధేయ రామ' తర్వాత ఆయన.. బాలయ్య తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, అది కార్యరూపం దాల్చేలా లేదు. దీంతో ఈ స్టార్ డైరెక్టర్ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్.. త్వరలోనే బోయపాటితో సినిమా చేస్తున్నామంటూ ప్రకటించడం విశేషం. అయితే, ఈ సినిమా ఎవరు చేస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

అల్లు అరవింద్ ప్రకటన

అల్లు అరవింద్ ప్రకటన

మూడు రోజుల క్రితం కార్తికేయ హీరోగా నటించిన ‘గుణ 369' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ ‘‘ఈ ఫంక్షన్‌కు శిష్యుడి కోసం వచ్చిన బోయపాటి గారికి అందరూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నేను ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే.. నాకు బోయపాటి గారు ‘సరైనోడు'తో సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చారు. మా కాంబినేషన్‌లో మళ్లీ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు. ఇక, దీనికి సంబంధించిన మిగిలిన విషయాలను మాత్రం వెల్లడించలేదు.

అల్లు అర్జున్ బిజీ

అల్లు అర్జున్ బిజీ

ఇదిలాఉండగా, అల్లు అరవింద్ ప్రకటించగానే.. ఈ సినిమా అల్లు అర్జున్‌తోనే ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే, బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌' అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. దీంతో అల్లు అర్జున్ ఈ సినిమా చేయడని అంటున్నారు.

చిరు చేయనన్నాడట

చిరు చేయనన్నాడట

రామ్ చరణ్‌కు ‘వినయ విధేయ రామ' వంటి ఫ్లాప్ ఇచ్చిన బోయపాటితో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయనన్నాడని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది. దీనికితోడు, ఆయన ‘సైరా: నరసింహారెడ్డి' తర్వాత కొరటాల శివతో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అది కూడా మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. దీంతో చిరు కూడా సినిమా చేయనట్లే.

మిగిలిన మెగా హీరోలు కూడా..

మిగిలిన మెగా హీరోలు కూడా..

వీళ్లు తప్పితే మిగిలిన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్‌లు కూడా బోయపాటితో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దీంతో ఈ సినిమా ఎవరు చేస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదు. మెగా హీరోలు ఎవరూ చేయకపోతే మరో హీరోను పెట్టి ఈ సినిమాను తీస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి, అల్లు అరవింద్ ఏం చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X