»   » చిరంజీవి ఫిల్మ్ సిటీ ప్లాన్ వైజాగ్‌లో 450 ఎకరాల్లో...?

చిరంజీవి ఫిల్మ్ సిటీ ప్లాన్ వైజాగ్‌లో 450 ఎకరాల్లో...?

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ నుండి తరలి వెలుతుందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సరైన ప్రదేశంగా వైజాగ్‌ను పేర్కొంటున్నారు. అయితే వైజాగ్‌లో పూర్తి సౌకర్యాలు లేక పోవడంతో చాలా మంది హైదరాబాద్ నుండి అక్కడికి పరిశ్రమను తరలించడానికి ఆసక్తి చూపడం లేదనే ప్రచారం కూడా సాగుతోంది.

    ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. అందులో చిరంజీవి పేరు ప్రముఖంగా వినపడుతుండటం గమనార్హం. చిరంజీవి, మరికొందరు కలిసి వైజాగ్ ప్రాంతంలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు వైజాగా, భీమిలీ ప్రాంతంలో 450 ఎకరాలు కొనుగోలు చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం వెనక చిరంజీవి ఉన్నారని, ఫిల్మ్ సిటీ నిర్మాణంలో భాగమే ఈ భూముల కొనుగోలు అని అంటున్నారు.

    మరో వైపు చిరంజీవి 150వ సినిమాపై కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

    కొత్త డౌట్స్

    కొత్త డౌట్స్

    ఆయన 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. అయితే తాజాగా మెగాస్టార్ సినిమాపై కొత్త డౌట్స్ ప్రారంభమయ్యాయి. ఈ డౌట్స్ ప్రచారంలోకి రావడానికి కారణం ప్రముఖ దర్శకుడు మణిరత్నం.

    మణిరత్నం

    మణిరత్నం

    ఇటీవల మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హైదరాబాద్ వచ్చారు. ‘సచిన్' అనే ఓ డబ్బింగ్ సినిమా గురించి వీరు హైదరాబాద్ వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా.....వీరు హైదరాబాద్ రావడం వెనక అసలు ఎజెండా వేరనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవితో దగ్గరి పరిచయం ఉన్న తన భార్య సుహాసిని తీసుకుని మణిరత్నం వచ్చారని, చిరంజీవితో 150వ సినిమా గురించి చర్చించారని అంటున్నారు.

    150వ సినిమా హాట్ టాపిక్

    150వ సినిమా హాట్ టాపిక్

    తనను కలవడానికి వచ్చిన చిరంజీవిని...గవర్నర్ నరసింహన్ సరదాగా 150వ సినిమా గురించి అడిగ్గా, సమాధానంగా చిరంజీవి..... మణిరత్నం ప్రస్తావన తెచ్చినట్లు టాక్. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా నటించే అవకాశం ఉందని అంటున్నారు.

    మెగా మూవీ

    మెగా మూవీ

    మెగాస్టార్ చిరంజీవి లాంటి వారితో సినిమా మొదలయ్యే క్రమంలో ఇలాంటి రకరకాల ప్రచారాలు జరుగడం మామూలు. అయితే అసలు విషయం ఏమిటనేది అఫీషియల్ సమాచారం వెలువడే వరకు చెప్పడం కష్టమే. అభిమానులకు అప్పటి వరకు ఈ గంధరగోళ వార్తలు భరించక తప్పదు.

    English summary
    Film Nagar source said that, Chiru's close aide, Ganta Srinivasa Rao, bought 450 acres of land between Bhimili and Vizag and in this land a film city is going to come which will be par excellent.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more