మెగా అభిమానులలో కొత్తఉత్సాహన్ని నింపిన ’పంజా’ టీజర్స్
టైటిల్ అనౌన్స్ అయ్యే వరకు ఎలాంటి చడీ చప్పుడూ లేని పవన్ కల్యాణ్ సినిమా ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ సినిమా ఆఫ్ ది సీజన్ అయిపోయింది. చాలా తెలివిగా ఈ సినిమా ప్రమోషన్ ని ప్లాన్ చేస్తున్న పంజా నిర్మాతలు తాజాగా టీజర్ ఒకటి విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఎలా ఉంటాడనేది రిజిష్టర్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్రించారుసూపర్ స్టైయిలిష్ గా ఉన్న ఈ టీజర్ చూసి మెగా అభిమానులు పండగచేసుకుంటున్నారు.
తమిళ్ దర్శకులు అంటే టూ మచ్ అనవసరమైన సెంటి మెంట్ సినిమాలో పెట్టేస్తారని భయం ఒకటుండేది అభిమానుల్లో అయితే పంజా టీజర్స్ చూసాక కొద్దిగా రిలాక్స్ అయినట్టు కనిపిస్తున్నారు మెగా ఫ్యాన్స్. 'మగధీర" సినిమా ఒక ఛాలెంజ్. ప్రతి హిరోకు ఒక నిర్దిష్టమైన గోల్ సెట్ చేసింది. ఇప్పుడు ట్రెండ్ ఎలా వుందంటే అభిమానులు కూడా నిర్మాతల మాదిరి భారీ ఓపినింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఎవేవో ఎక్సపెట్ చేస్తాం. ఎక్సపెట్ చేసేవి కూడా హై రేంజ్‌లో వుంటాయి. ఆ అంచనాలు ఏ రేంజ్‌లోకి వెళ్ళాయంటే 'అసలు పవన్ కల్యాణ్ నుంచి ఏమి ఎక్సపెట్ చేస్తున్నామో' తెలియనంత రేంజ్‌లోకి వెళ్ళిపొయాయి.
అభిమానుల రెస్పాన్స్ చూస్తుంటే మెగా అభిమానులలో నూతనోత్సాహన్ని నింపిన "పంజా" టీజర్ అనిపిస్తుంది. టీజర్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే:
పవన్ కల్యాణ్ చాలా న్యాచురల్ గా, సింపుల్ గా టూ గుడ్ వున్నాడు. తర్వాత డైరక్టర్ విష్ణువర్దన్ స్టైలిష్ టేకింగ్ మీద నమ్మకం వచ్చింది. మ్యూజిక్ చాలా క్లాస్ గా మాస్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇవన్నీ మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.


Click it and Unblock the Notifications











