Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ చరణ్ కోసం క్యూలో మరో ఇద్దరు దర్శకులు.. RRR తరువాత వారితోనే..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి స్పెషల్ ప్లాన్ రెడీ చేస్తున్నాడు. దాదాపు 70% షూటింగ్ అయితే అయిపోయింది. ఇక మిగిలిన షూటింగ్ లో రామ్ చరణ్ పూర్తి చేయాల్సింది చాలా తక్కువగా ఉంది. పూర్తి చేయాల్సిన 30% షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉందట.
అక్టోబర్ లో లేదా నవంబర్ లో ఎలాగైనా RRR రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే.. రామ్ చరణ్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. RRR తరువాత జూనియర్ ఎన్టీఆర్ అయితే త్రివిక్రమ్ ని సెట్ చేసుకున్నాడు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేస్తాడు. కానీ చరణ్ ఎవరితో వర్క్ చేస్తారు అనేది ఇంకా ఫైనల్ కాలేదు.
గత కొన్ని వారాల క్రితం భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వచ్చింది. కానీ అవన్నీ రూమర్స్ అని తరువాత చరణ్ ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ హీరో కోసం ఇద్దరు టాలెంటెడ్ దర్శకులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. జెర్సీ దర్శకుడు గౌతమ్, అలాగే అర్జున్ రెడ్డి వంగా రామ్ చరణ్ తో వర్క్ చేయాలని ట్రై చేస్తున్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఆ దర్శకులిద్దరు కూడా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.