ప్రభాస్ స్నేహితులతో రామ్ చరణ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. ఆ దర్శకుడితో నెవ్వర్ బిఫోర్ ప్లాన్ రెడీ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటే మరొక సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా మెగా పవర్ స్టార్ కూడా మిగతా అగ్ర హీరోల తరహాలోనే అతిపెద్ద ఫ్యాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నట్లుగా అర్థమవుతోంది. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ప్రభాస్ టీమ్ తో చేతులు కలిపిన రామ్ చరణ్ ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడు ఎవరు ఆ సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే..

బిగ్ హిట్.. బిగ్ డిజాస్టర్

బిగ్ హిట్.. బిగ్ డిజాస్టర్

ఈ ఏడాది రామ్ చరణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద RRR సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో తండ్రితో కలిసి ఒక మంచి టైమింగ్ ఉన్న పాత్రలో నటించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సినిమా సక్సెస్ కాలేక పోయింది. అయినప్పటికీ కూడా ఈ హీరో రేంజ్ అయితే ఆస్సలు తగ్గలేదు.

శంకర్, బుచ్చిబాబు మూవీస్

శంకర్, బుచ్చిబాబు మూవీస్

రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఒకటి క్యాన్సిల్

ఒకటి క్యాన్సిల్

ఇప్పుడున్న అగ్ర హీరోలలో ఎక్కువ స్థాయిలో అతిపెద్ద భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న వారిలో రామ్ చరణ్ కూడా టాప్ లిస్టులో ఉన్నాడు అని చెప్పవచ్చు. అసలైతే శంకర్ సినిమాను ఒకవైపు కొనసాగిస్తూనే మరొకవైపు జెర్సీ దర్శకుడు గౌతమ్ తో కూడా ఒక సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ ఎందుకో ఫైనల్ స్టేజ్ లోనే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది.

ప్రభాస్ టీమ్ తో మూవీ

ప్రభాస్ టీమ్ తో మూవీ

ఇక రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరికొన్ని ప్రాజెక్టులను ఓకే చేయాలని అనుకుంటున్నాడు. ఇక రామ్ చరణ్ తేజ్ ఇప్పటినుంచో UV క్రియేషన్స్ లో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ప్రభాస్ కు అత్యంత క్లోజ్ అయిన యువి క్రియేషన్స్ అంటే రామ్ చరణ్ కు కూడా చాలా ఇష్టమే. వారితో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వారి ప్రొడక్షన్లో బిగ్ బడ్జెట్ మూవీ చేయాలని రామ్ చరణ్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు.

కన్నడ దర్శకుడితో ఫిక్స్

కన్నడ దర్శకుడితో ఫిక్స్

అయితే వీరి కలయికలో దర్శకుడు ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలుపడ్డాయి. కన్నడ దర్శకుడు నర్థన్ ఫిక్స్ అయిపోయినట్లుగా కూడా ఇటీవల ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అయితే సినిమా కథ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. కానీ రామ్ చరణ్ మాత్రం దాదాపు ఈ దర్శకుడికి బాగా కనెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది.

అలాంటి కథతో యాక్షన్ మూవీ

అలాంటి కథతో యాక్షన్ మూవీ

ఇక పూర్తిస్థాయిలో కథ రెడీ అయిన తర్వాత ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత సెట్స్ పైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ ను నర్థన్ నెవ్వర్ అనేలా చూపించబొతున్నట్లు సమాచారం. ఆ కథ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ నేపథ్యంలో తెరకెక్కే సరికొత్త థ్రిల్లర్ యాక్షన్ మూవీ అని ఒక టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X