మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. బాబాయ్ సినిమాలో అబ్బాయ్ కీ రోల్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం మెగా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆజ్ఞతవాసి సినిమా అనంతరం పవర్ స్టార్ ని బిగ్ స్క్రీన్ పై చూసి చాలా కాలమవుతోంది. అయితే లేటయినా సరే రీ ఎంట్రీతో పవన్ ఆడియెన్స్ కి సరికొత్త కిక్కిచ్చే అవకాశం లేకపోలేదు. ఇక మరొక బోనస్ గా కొత్త కిక్కు ఏమిటంటే పవర్ స్టార్ సినిమాలో మెగా తనయుడు మెగా పవర్ స్టార్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

పవర్ స్టార్ ఫుల్ బిజీ..
మొదట పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ డిఫరెంట్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కి కరోనా కర్ఫ్యూ కారణంగా బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా అనంతపురం పవన్ క్రిష్ తో మరొక సినిమా చేయబోతున్నాడు.

క్రిష్ సినిమా కోసం స్పెషల్ ప్లాన్..
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్ 27వ సినిమా పనులు కూడా స్పీడ్ అందుకున్న సమయంలో కరోనా బ్రేక్ వేసింది. ఇక లాక్ డౌన్ ఎత్తువేసిన అనంతరం పవన్ క్రిష్ ప్రాజెక్ట్ తోనే ఫుల్ బిజీ కానున్నాడు. ఇప్పటికే సినిమాకు వీరుపాక్షి అనే టైటిల్ ని సెట్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక ఆ సినిమా పాత్రలపై రోజుకో రూమర్ వెలువడుతోంది.

బాబాయ్ సినిమాలో అబ్బాయ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పటివరకు గెస్ట్ రోల్స్ లో పెద్దగా నటించింది లేదు. అయితే కెరీర్ లో మొదటిసారిగా తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే రామ్ చరణ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు, ఎంత సేపు ఉంటాడు అనే విషయాలపై ఎలాంటి సమాచారం లేదు.
Recommended Video

మెగా ఫ్యాన్స్ కి కిక్కచ్చే న్యూస్..
నిజానికి మెగా హీరోలు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులకు ఎప్పటినుంచో ఉన్న ఆశ. మగధీర సినిమా తప్పితే ఇంతవరకు వారికి సర్ప్రైజ్ ఇచ్చిన సందర్భాలు లేవు. ఇక ఇపుడు పవన్ సినిమాలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అనగానే చాలా మంది ఫ్యాన్స్ ఇది రూమర్ కాకుండా నిజమైతే బావుండు అని కోరుకుంటున్నారు. మరి వారి డ్రీమ్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











