బాలయ్యతో రాంచరణ్.. అల్లు అర్జున్ కాకుండా చెర్రీ తెరపైకి!
తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహాకు క్రేజ్ తీసుకొచ్చి, పోటీలో నిలబెట్టిన టాక్ షో unstoppable. హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణను తీసుకురావాలన్న అల్లు అరవింద్ ప్లాన్ అన్ని రకాలుగా వర్కవుట్ అయి ఆహాకు పెద్ద వరమైంది. బాలయ్య తన టైమింగ్, ఆట పాటలతో అన్‌స్టాపబుల్‌ను బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టారు. ఇప్పటికే మూడు సీజన్లను కంప్లీట్ చేసుకున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4కి సిద్ధమైంది. ఇప్పటికే ఈ షో ట్రైలర్‌ను ఆహా టీమ్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్‌కు ఎవరు వస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే :
హీరోగా పవర్‌ఫుల్ రోల్స్‌తో ఎంటర్‌టైన్ చేశారు బాలయ్య. ఆయనకు ముక్కు మీద కోపమని, సెట్‌లో చాలా సీరియస్‌గా ఉంటారని బాలకృష్ణ గురించి అంతా అనుకుంటారు. కానీ ఆయనను దగ్గరి నుంచి చూసినవాళ్లు మాత్రం.. బాలయ్య ఎనర్జీ ముందు ఎవ్వరూ పనికిరారని, సెట్స్‌లో చిన్నా, పెద్దా అందరితో చాలా సరదాగా ఉంటారని చెబుతారు. అలాంటిది బాలకృష్ణ ఒరిజినల్ క్యారెక్టర్‌ను స్క్రీన్‌పై ఆవిష్కరించింది అన్‌స్టాపబుల్ . గెస్ట్‌లతో చేసే అల్లరి, టాస్క్‌లతో హోస్ట్‌గా సక్సెస్ కొట్టారు బాలయ్య..

ఇప్పటి వరకు మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఈ షోకు పవన్ కళ్యాణ్ , మహేశ్ బాబు, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని , శర్వానంద్, గోపీచంద్ వంటి స్టార్స్‌ను, హీరోయిన్లను, డైరెక్టర్లను, నిర్మాతలను తీసుకొచ్చారు బాలకృష్ణ. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 3 మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఏకంగా టీడీపీ అధినేత, ఇప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను ఈ షోకు తీసుకొచ్చి వారిని ఫన్నీగా ఇంటర్వ్యూ చేశారు బాలయ్య. ఎప్పుడు రాజకీయాలతో సీరియస్‌గా ఉండే చంద్రబాబులోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.
ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ సీజన్ 4 కోసం ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నేడో రేపో అన్నట్లుగా సోషల్ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. వీటికి చెక్ పెడుతూ ఈ ఏడాది దసరా సందర్భంగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్‌ను గ్రాండ్ లాంచ్ చేసింది ఆహా టీమ్. ఇంత వరకు ఎప్పుడూ చూడని విధంగా బాలకృష్ణను సూపర్ హీరోగా ప్రజెంట్ చేశారు అల్లు అరవింద్. దాదాపు 4 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అక్టోబర్ 24 నుంచి సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతుందని ఆహా టీమ్ అనౌన్స్ చేసింది. ఇంతకీ ఈ సీజన్‌కు గెస్ట్‌లుగా ఎవరు రానున్నారు.. అన్నింటికి మించి సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌లో బాలయ్యతో కబుర్లు చెప్పేది ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.
సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని ఫిలింనగర్ టాక్. బాలయ్యతో దశాబ్ధాల అనుబంధంతో పాటు తెలుగు సినిమాకు ప్రస్తుతం ఫోర్ పిల్లర్స్‌గా వ్యవహరిస్తున్న ఇద్దరు అగ్రకథానాయకులను ఒకే చోట కబుర్లు చెప్పుకుంటుంటే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇంకొన్ని సర్కిల్స్‌లో మాత్రం అల్లు అర్జున్ వస్తారని వినిపిస్తోంది. గతంలో అన్‌స్టాపబుల్‌కు బన్నీ హాజరైన సోలోగా రాలేదు.. పుష్ప సినిమా ప్రమోషన్ కోసం వచ్చారు.
అందుకే ఈసారి సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌కు అల్లు అర్జున్ రావడం పక్కా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవి, బన్నీ కాదు.. అసలు ఈసారి వచ్చేది మెగా పవర్ స్టార్ రామ్ చరణే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ మొదలుకానుందని ఫిలింనగర్ టాక్. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











