హ్యాండీక్యాప్డ్​గా రామ్​ చరణ్​.. RC16 స్టోరీ లీక్​ అయిపోయిందోచ్​.. విలన్​గా తమిళ స్టార్ హీరో!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. చరణ్ రేంజ్.. ఇప్పుడు టాలీవుడ్ నుంచి.. హాలీవుడ్ కు పాకింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చెర్రీ గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్.. బుచ్చిబాబు సానాతో తన 16వ సినిమా చేయనున్నాడు. ఆర్సీ 16 గా పిలువబడుతున్న ఈసినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే....

మెగావారుసుడిగా ఎంట్రీ ఇచ్చి...: మెగా వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా... తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. మొదటి సినిమా చిరుతతోనే తనేంటో ఫ్రూవ్ చేసుకున్న చెర్రీ ఇక రెండో సినిమా మగధీరతో దేశవ్యాప్త గుర్తింపు పొందాడు. వరుసగా సినిమాలు చేస్తూ.. మొన్నటి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు చరణ్. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉంది.

Ram Chara

ఇంట్రెస్టింగ్ అప్డేట్స్...: అయితే తన 16వ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. చరణ్ తన నెక్ట్స్ సినిమాను బుచ్చిబాబు సానాతో చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాడు. బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెన. ఇక ఈ సినిమా ఎంత సూపర్ హిట్టుగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా రిలీజ్ అయి.. దాదాపు 100కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. సుకూమర్ శిష్యూడిగా బుచ్చిబాబు.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

Ram Chara

ఆర్సీ 16 స్టోరీ లీక్: ఇదిలా ఉండగా.. ఆర్సీ 16 మూవీ స్టోరీ లీక్ అయింది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్నట్లు ఇదివరకే ప్రచారం జరిగింది. అయితే ఇందులో హీరో స్పోర్ట్స్ మ్యాన్. చిన్న గ్రామం నుంచి మొదలైన అతని ప్రస్థానం అంతర్జాతీయంగా తీసుకెళ్లాలనుకుంటాడు. అయితే విలన్ అడ్డుపడటంతో హీరో ఆటల్లో పాల్గొన్నప్పుడు ఓ అవయవాన్ని కోల్పోతాడు. తన సాధించకుండా విలన్ అడ్డుకుంటాడు. అయినప్పటికీ హీరో కృంగిపోకుండా... తన ఆశయాన్ని సాధించడానికి ఒక కొత్త జట్టును ఏర్పాటు చేసి.. వారు అంతర్జాతీయ స్థాయిలో కప్‌ ఎలా సాధించారు అనేదే కథ.

Ram Chara

సింపుల్ స్టోరీ...: స్టోరీ సింపుల్ గా ఉన్నప్పటికీ... ప్రజెంటేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ సరనస బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ నటించనుంది. ఇక ప్రత్యేక పాత్రలో అనగా విలన్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కనిపించనున్నారని సమాచారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం వెయిటింగ్: ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఆర్‌సీ16 మూవీ రూపొందనుంది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రానుంది. ఈ సినిమా చిత్రీకరణలో రామ్‍చరణ్ త్వరలోనే పాల్గొననున్నాడు. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలవుతుందని అంచనా. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్‍లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక వచ్చే ఏడాది మార్చిలో విడుదలవుతుందని అంచనా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X