పవన్ కళ్యాణ్ బర్త్ డేకి సర్‌ప్రైజ్.. రాంచరణ్ ప్లానింగ్ అంటూ!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. రంగస్థలం ఘనవిజయం సాధించిన వేంటనే బోయపాటి దర్శత్వంలో సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా అభిమానులకు ఇంతవరకు టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ ముచ్చట కానీ తీరలేదు. బోయపాటి, చరణ్ తొలి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

నిరాశపరిచిన చరణ్
బోయపాటి, చరణ్ సినిమా ఫస్ట్ లుక్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు విడుదల చేస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ ఆ రోజు సైరా టీజర్ తో మెగాస్టార్ సందడి చేయడంతో చరణ్ తన సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటించలేదు. దీనితో ఫాన్స్ కు కొంత నిరాశ తప్పలేదు.

పవన్ బర్త్ డేకి సర్‌ప్రైజ్
తాజాగా సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బోయపాటి చిత్ర ఫస్ట్ లుక్ లేదా టైటిల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయవలసి ఉంది. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుక జరగనుంది.

ప్రత్యేక ప్రేమ
పవన్ పై చరణ్ ప్రత్యేక ప్రేమని చాటుకుంటుంటాడు. రంగస్థలం విజయోత్సవ వేడుకలో వీరి మధ్య బాండింగ్ ని అంతా గమనించారు. ఇటీవల సైరా చిత్ర టీజర్ ని తొలిసారి బాబాయ్ కి చూపించానని చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పుట్టినరోజు రాంచరణ్ 12 వ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు పెరుగుతున్నాయి.

హ్యాట్రిక్
ధృవ, రంగస్థలం విజయాల తరువాత బోయపాటి చిత్రంతో చరణ్ హ్యాట్రిక్ పై కన్నేశాడు. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











