ఆగస్టులో మెగా ఫ్యాన్స్‌కి మరో పండుగ.. మొత్తానికి మూడు ముళ్లు వేస్తున్నారు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఇటీవలే అంగరంగ వైవభంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...

గ్రాండ్ గా ఎంగేజ్మెంట్: వరుణ్ తేజ్ - క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో డేటింగ్‌లో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ వార్తలను నిజం చేస్తూ ఇద్దరు గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ తో పాటు పలువురు సెలబ్రిటీలు వచ్చి వేడుకలో సందడి చేశారు. కాబోయే కొత్త జంటను ఆశీర్వదించారు.

Mega Prince Varun Tej and Lavanya Marriage Date fix news viral in social media

ఫారిన్ ట్రిప్‌కు: ఇక ఎంగేజ్‌మెంట్ తర్వాత వరుణ్ లావణ్య ఫారిన్ ట్రిప్‌కు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇటీవలే కాఫీ డేట్‌కు కూడా వెళ్ళి వచ్చారు. ఈ విషయాన్ని ఇద్దరు స్వయంగా తమ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఒకరి ఫోటోను మరొకరు షేర్ చేసుకున్నారు. దీంతో ఈ క్యూట్ కపుల్‌ ఫొటోస్ ను.. మెగా ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేశారు.

Mega Prince Varun Tej and Lavanya Marriage Date fix news viral in social media

ఒక్కటయ్యే క్షణం: పెళ్లి డేట్.. వరుణ్-లావణ్య ఒక్కటయ్యే క్షణం వచ్చే సిందంటూ ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 24వ తేదీన.. ఇటలీలో వీరి వివాహం గ్రాండ్‌గా జరగనుందని అంతా అంటున్నారు. అక్కడే వారి ప్రేమ చిగురించిందట. మరో విషయమేమిటంటే.. పెళ్లికి సంబంధించిన పనులను లావణ్య, వరుణ్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారట.

Mega Prince Varun Tej and Lavanya Marriage Date fix news viral in social media

అభినందనలు తెలుపుతూ: ప్రస్తుతం ఈ పెళ్లి మూహుర్తం గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. మరి ఈ వార్త ఒరిజినలా.. లేదా ఫేకా అని తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ విషయం పై మెగా ఫ్యామిలిలో ఎవరు స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

Mega Prince Varun Tej and Lavanya Marriage Date fix news viral in social media

సినిమాలు: 2017లో విడుదలైన మిస్టర్‌ సినిమా కోసం తొలిసారి వరుణ్‌- లావణ్య కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ఏడాదిలోనే వీరి కాంబినేషన్‌లో మరో సినిమా అంతరిక్షం వచ్చింది. ఈ రెండు అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇదే సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇకపోతే ప్రస్తుతం వరుణ్‌ నటిస్తున్న గాండీవధారి అర్జున ఆగస్టు 25న విడుదలకు సిద్ధంగా ఉంది.

దీని తర్వాత వరుణ్‌.. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా, కరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు. మరోవైపు, లావణ్య.. ప్రస్తుతం కోలీవుడ్‌లో అధర్వ హీరోగా ఓ సినిమా చేస్తోంది. ఇంకా పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఓ సినిమా, వెబ్‌సిరీస్‌ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X