మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలకు వేళాయే.. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్

వరుణ్ తేజ్, లావణ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య వీరి ప్రేమను ఇంట్లో చెప్పి.. ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగైజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఇప్పటికే జరగాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక వీరి విహహం ఇటలీలో జరగనుండగా... వీరి పెళ్లి డేట్ పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్‌ 9వ తేదీన నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఎంగేజ్మెంట్ అయినప్పటికీ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. దీంతో నెట్టింట మెగా ఫ్యాన్స్ తెగా హడావుడి చేసేస్తున్నారు.

 Varun Tej and Lavanya Tripathi

ఇక వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లిపై ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక వీరు ఇప్పటికే పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా... పలు కారణాలతో వాయిదాపడుతూ వస్తోంది. మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగే క్షణాలు దగ్గర్లోనే ఉన్నాయనే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న వారికి నిరాశే మిగిలింది. అయితే వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇప్పటికీ ఏర్పాట్లు మొదలు పెట్టారు. వరుణ్ తేజ్, లావణ్య వివాహం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ గా జరిపిందేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వీరి వివాహం ఆగస్టులోనే జరగాల్సి ఉంది.. కానీ వరుణ్ తేజ్ సినిమాలు ఒకవైపు.. నిహారిక విడాకులు వ్యవహారం వంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందని అంటున్నారు.

 Varun Tej and Lavanya Tripathi

ఇక వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి నవంబరు నెలలో ఉండనుందని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు కుటుంబ పెద్దలు నవంబర్ 1వ తేదీని ఈ జంట పెళ్లి తేదీగా లాక్ చేశారని తెలుస్తోంది. ఇక వీరి వివాహం ఇరు కుటుంబల సమక్షంలో ఇటలీలో జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని ఇప్పటికే విషయం బయటకు వచ్చింది.

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లికి ఇరు కుటుంబాలే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు.. పవన్ కల్యాణ్ కూడా హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే.. నవంబర్ అంటే ఆలోపు ఎలక్షన్స్ బిజీలో ఉండనున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈనెల 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X