twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ సన్నిహితుడికి జనసేన పార్టీకి టికెట్ కంఫర్మ్?

    |

    Recommended Video

    Mega Producer Contesting As MLA From Janasena Party | Oneindia Telugu

    పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలని కలుసుకుంటున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన జనసేన పార్టీని ఎన్నికల సమరానికి సిద్ధం చేసేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవలే అన్ని జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ రాజమండ్రి నగరంలో జరగబోతోంది. ఈ నేపధ్య్మలో జనసేన పార్టీకి గురించి ఆసక్తికర ప్రచారం సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

    కుటుంబానికి దూరంగా రాజకీయం

    కుటుంబానికి దూరంగా రాజకీయం

    పవన్ కళ్యాణ్ ఒంటరిగానే రాజకీయాల్లో పోరాటం చేస్తున్నారు. మెగా కుటుంబం నుంచి నైతిక మద్దత్తు ఉన్నా.. వారెవరూ ప్రత్యక్షంగా జనసేన పార్టీలో లేరు. మెగా బ్రదర్ నాగబాబు కూడా జనసేన పార్టీలో చేరకుండా బయటి నుంచి పవన్ కు మద్దత్తు ఇస్తున్నారు. మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి కాకపోయినా ఆ కాంపౌండ్ నుంచి తొలిసారి ఓ వ్యక్తి పేరు జనసేన పార్టీలో వినిపిస్తోంది. ఆయనెవరో కాదు అల్లు అర్జున్ సన్నిహితుడు, నిర్మాత అయిన బన్నీ వాసు.

    అధికారికంగా

    అధికారికంగా

    మార్చి 14న రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా ఏర్పాటు జరుగుతున్నాయి. సభ నిర్వహణ కోసం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓ కమిటీని వేశారు. ఈ కమిటీలో బన్నీ వాసు పేరుని కూడా అధికారికంగా జనసేన పార్టీ ప్రకటించడం ఆసక్తిగా మారింది. చాలా రోజులుగా బన్నీ వాసు పవన్ కళ్యాన్ తో సన్నిహితంగా మెలుగుతున్నారు. మెగా ఫ్యామిలీ అభిమానిగానే పవన్ తో సన్నిహితంగా ఉంటున్నాడని అంతా అనుకున్నారు. కానీ తాజా ప్రకటన ద్వారా బన్నీ వాసు జనసేనలో అధికారిక మెంబర్ అయిపోయారు.

    దేశమంటే పట్టదా? నీ విలాసాలు ప్రజల భిక్ష.. రణ్‌బీర్, అలియాపై కంగన ఫైర్lదేశమంటే పట్టదా? నీ విలాసాలు ప్రజల భిక్ష.. రణ్‌బీర్, అలియాపై కంగన ఫైర్l

    టికెట్ ఖాయమా

    టికెట్ ఖాయమా

    బన్నీ వాసు గురించి మరో ఆసక్తికర ప్రచారం కూడా జరుగుతోంది. జనసేన పార్టీ తరుపున బన్నీ వాసుకి టికెట్ దాదాపుగా ఖాయం అయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పాలకొల్లు నియోజకవర్గం నుంచి బన్నీ వాసు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అల్లు అర్జున్ పాలకొల్లుకు వెళ్ళినప్పుడు బన్నీ వాసు అభిమానులతో ర్యాలీ ఏర్పాటు చేశాడు. పవన్ పర్యటించిన సంధర్భంలో కూడా ఏర్పాట్లు చేసింది బన్నీవాసునే.

     ప్రకటించలేదు

    ప్రకటించలేదు

    బన్నీ వాసు పోటీ చేసే విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కొన్ని నియోజకవర్గాల్లో తప్ప అభ్యర్థుల్ని ఇంకా ఖరారు చేయలేదు. ఇక మెగా బ్రదర్ నాగబాబు పవన్ కి మద్దత్తు తెలుపుతూ యూట్యూబ్ లో వీడియోలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. నాగబాబు చేస్తున్న వీడియోలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారుతున్నాయి.

    English summary
    Mega Producer contesting as MLA from Janasena Party
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X