ఇంత జరిగినా మారరా .. అల్లు - మెగా ఫ్యాన్స్‌కి బడిత పూజకి సర్వం సిద్ధం!
గత కొన్ని నెలలుగా మెగా , అల్లు అభిమానులు నడుమ ఎలాంటి రచ్చ కొనసాగుతూ వచ్చిందో అందరికీ తెలిసిందే. గత జూన్ నుంచి మొదలైన ఈ తతంగం అంతా ఇపుడు ఈ ఏడాది పూర్తి కావస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఈ ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికల పుణ్యమా అని అల్లు అర్జున్ తమ కుటుంబంలో ఉన్న పార్టీ నాయకుడు, తమ కుటుంబ సభ్యుడికి కాదని వ్యతిరేక పార్టీ కాండిడేట్ కి ప్రచారం చేయడం మెగా అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.
ఇది కాకుండా తర్వాత అల్లు అర్జున్ చేసిన పలు కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో మెగా అండ్ అల్లు అభిమానుల నడుమ పెద్ద గొడవలే తీసుకొచ్చాయి. అలా ఒకొకటిగా ఇది డోస్ పెరుగుతూనే వచ్చింది . కాగా లేటెస్ట్‌గా ఏపీలో పుష్ప 2 టికెట్ ధరల పెంపు అలాగే హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ఈ విషయంలో మెగాస్టార్ చొరవతో బన్నీ బయటకి రావడం వంటివి కలకలం రేపాయి. బయట ఏం జరుగుతున్నా సరే ఫ్యామిలీ పరంగా వీరెప్పుడూ కలిసే ఉంటారు అని ఈ దెబ్బతో అందరికీ ఒక క్లియర్ మెసేజ్ వచ్చేసింది.

అయితే పెద్దోళ్ళు వాళ్లే కలిసిపోయారు కానీ .. ఈ సోషల్ మీడియాలో మాత్రం మెగా అండ్ అల్లు అభిమానుల మధ్య వార్ ఆగడం లేదు. ఇది అలా పెరుగుతూ వెళుతూ రానున్న రోజుల్లో మరింత ఎక్కువ అయ్యే రీతిలో కనిపిస్తోంది. అయితే దీనికి అడ్డుకట్ట వెయ్యాలని మెగా కుటుంబం ఎప్పటికీ కలిసే ఉండాలి అని కోరుకునే కొందరు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్ వార్స్ పై మెగా అండ్ అల్లు కుటుంబానికి దగ్గరగా ఉన్న ప్రముఖులే ఇపుడు రంగంలో దిగే యోచనలో ఉన్నారట. ఇపుడు మొత్తం రచ్చ అంతా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లోనే జరుగుతుంది. ఈ వేదికగానే అల్లు, మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ అందరిని ఓ చోట చేర్చి వీటికి ఎండ్ కార్డు వేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెబుతున్నారు.

ముఖ్యంగా ఈ గొడవలకి కొందరు కారకులుగా ఆయన అనుమానిస్తున్నారు. వీరిని కూడా ఎక్స్ స్పేస్‌లోకి తీసుకొచ్చి మెగా అండ్ అల్లు ఫ్యాన్ వార్స్ ఆపాలని ప్లాన్ చేస్తున్నారట. దీనితో ఇది సక్సెస్ అయితే సోషల్ మీడియాలో మెగా అండ్ అల్లు అభిమానుల నడుమ గొడవలు కొంచెం అయినా తగ్గుతాయని చెప్పొచ్చు.
ఒకప్పుడు అంతా ఒకే కుటుంబంలా ఉండి ఇపుడు విడిపోయి కొట్టుకోవడం, ఓ పక్క హీరోలే ఒకటైనప్పుడు వారి అభిమానులు మాత్రం ఇంకా కలవకుండా ఒకరిని ఒకరు దూషించుకోవడం అనేది ఆ హీరోలకే మరింత డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు. దీనితో ఈ సెన్స్ లెస్ ఫ్యాన్ వార్స్ మూలాన అక్కడ హీరోల మార్కెట్‌లు సినిమాల వసూళ్లు దెబ్బ తింటాయని హెచ్చరిస్తున్నారు


Click it and Unblock the Notifications











