మరోసారి రాజకీయాల్లోకి చిరంజీవి.. ఏ పార్టీ తరఫున ఎంపీ కాబోతున్నారో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే ఈయన హీరోగా అనేక మంది అభిమానులను సంపాధించుకున్నాడు. కేవలం సినిమాల్లోనే కాకుండా గతంలో రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మళ్లీ రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే తాజాగా మరోసారి ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయనను ఆ రాష్ట్రం నుంచి ఎంపీ స్థానం కల్పించాలని ఓ పార్టీ ప్లాన్ చేస్తోందట. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
చిరంజీవి 2008లో ఆగస్టు 26వ తేదీన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ఏడాది అంటే 2009లో ఏపీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. మొత్తం 295 స్థానాల్లో పోటీ చేసి మొత్తం 18 స్థానాల్లో గెలిచారు. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా.. తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లులో ఓడిపోయాడు. ఆ తర్వాత తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అలా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది...కేంద్ర పర్యాటక మంత్రి గా శ్వంతంత్ర హోదా లో విధులు నిర్వర్తించారు.

ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నాడు. చిరంజీవి రాజకీయాల్లోంచి వచ్చేసిన తర్వాత ఆయన తమ్ముడు పవన్ కల్యామ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా జనసేన పార్టీని నెలకొల్పి 2014 ఎన్నికల్లో మిగతా పార్టీలకు మద్దతు ఇచ్చారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన కేవలం ఒకే ఒక్క స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈక్రమంలో పవన్ కల్యాణ్ సోదరుడు అటు తమ్ముడు పార్టీ జనసేనతో లేదా పొత్తు పెట్టుకున్న టీడీపీకి మద్దతు ఇవ్వాలి. కానీ ఈ రెండింటికి కాకుండా మరో కొత్త పార్టీ నుంచి ఆయన ఎంపీ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. మెగాస్టార్ చిరంజీవికి ఉత్తర్ ప్రదేశ్ ఎంపీగా స్థానం కల్పించాలని చూస్తోందట. ఇటీవలే అయోధ్యలో జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆయన కుటుంబాన్ని ఆహ్వానించడం, నాలుగు రోజుల క్రితమే ఆయనకు పద్మ విభూషణ్ ఇవ్వడం చూస్తుంటే ఈ వార్తలన్నీ నిజం అయ్యేలా ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రాజ్య సభ సభ్యుడిగా కొనసాగిన బీవీఎల్ నరసింహారావు స్థానంలో చిరంజీవిని పెద్దల సభకు పంపించబోతున్నారని సమాచాం. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











