Balakrishna-Chiranjeevi: డైరెక్టర్లను మార్చుకున్న చిరు, బాలయ్య ..ఇది కదా అసలైన అరాచకం
టాలీవుడ్ టాప్ హీరోయిలుగా వెలుగొందుతున్న బాలకృష్ణ, చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే కుర్ర హీరోలకు పోటీగా ఈ హీరోలు సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే వీరి సినిమాలను ఓ సారి గమనిస్తే.. బాలకృష్ణ, చిరంజీవి దర్శకులను మార్చుకుని సినిమాలు చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వస్తున్నాయంటే.. ప్రేక్షకుల్లో జోష్ ఉంటుంది. ఇక ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. మా హీరో సినిమా గొప్పది అంటే.. మా హీరో సినిమా గొప్పది అని అభిమానులు కొట్టుకుంటుంటారు. అయితే ఈ ఏడాది చిరంజీవి... బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది. ఇక బాలకృష్ణ.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహరెడ్డి సినిమా చేశారు.

అయితే బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు ఒకరోజు తేడాతో రిలీజ్ అయి... రెండు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాల్లో హీరోయిన్ గా శృతి హాసన్ గా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే... బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ ఆగర్వాల్ నటిస్తోంది. టాలీవుడ్ సెన్సెషన్ హీరోయిన్ శ్రీలీల... బాలయ్య బాబు కూతురిగా నటించనుంది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలిజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటోంది.

అయితే ఇప్పుడు ఆసక్తికర విషయం ఏమింటంటే... చిరంజీవి, బాలకృష్ణ వారి సినిమాల డైరెక్టర్లను మార్చుకోబోతున్నారు. బాబీ దర్శకత్వంలో చిరు వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది. ఇప్పుడు బాబీ.. బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను ఆఫిషియల్ గా ప్రకటించారు. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక చిరు కల్యాణ్ కృష్ణ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్యతో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరుతో సినిమా చేయనున్నారు. అలా బాలయ్య, చిరంజీవి వారి డైరెక్టర్లను మార్చుకున్నారు. ఇది అభిమానులకు పండగ లాంటి న్యూస్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











