చిరంజీవి రిజెక్ట్ చేసిన విషయం హాట్ టాపికైంది
హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి త్వరలో 150వ సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిరంజీవి ఇప్పటికే చాలా స్ర్కిప్టులు విన్నారు. ప్రముఖ సౌతిండియన్ డైరెక్టర్ మణిరత్నం కూడా ఆ మధ్య చిరంజీవికి స్క్రిప్టు వినిపించారని టాక్. అయితే చిరంజీవి కోరుకున్న విధంగా మణిరత్నం స్క్రిప్టు లేదని, దీంతో చిరంజీవి దాన్ని తిరస్కరించినట్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయం ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.
చిరంజీవి 150వ సినిమా అనగానే చాలా మంది చాలా రకాలుగా ఊహించుకుంటున్నారు. చిరంజీవి ఇమేజ్‌కు తగిన విధంగా చాలా బరువైన మెసేజ్ ఓరియెంటెడ్ స్క్రిప్టులతో ఆయన వద్దకు వస్తున్నారు రచయితలు. పరుచూరి బ్రదర్స్ లాంటి 'ఉయ్యాల వాడ నరసింహారెడ్డి' లాంటి కథలతో వస్తే, ఇతర రచయితలు కూడా అలాంటి బరువైన కథలతోనే వస్తున్నారు.

అయితే చిరంజీవి ఆలోచన మాత్రం చాలా భిన్నంగా ఉంది. తన 150వ సినిమా గురించి చిరంజీవి ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ..150వ ఈ సినిమాను నెల లోపులోనే ప్రారంభిస్తాం. ఈ సినిమా సబ్జెక్ట్ అందరినీ అలరించే విధంగా ఉంటుంది. ప్రేక్షకులకు మెసేజ్ ఇచ్చే విధంగా సందేశాత్మక చిత్రం తీస్తే మన ప్రేక్షకులు చూసే పరిస్థితి లేదు. అందుకే శంకర్‌దాదా, రౌడీ అల్లుడు లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్నే చేస్తాను అన్నారు చిరంజీవి.
ప్రస్తుతం ప్రొడక్షన్ ఖర్చు బాగా పెరిగింది. నిర్మాత బాగు కోసం వాటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. హీరో, హీరోయిన్ల పారితోషికం నుంచి రకరకాల ప్రొడక్షన్ ఖర్చుల దాకా అన్నింటినీ పరిశీలించి తక్కువ బడ్జెట్‌తో 150 సినిమా చేస్తానని చిరంజీవి అంటున్నారు. చిరంజీవి 150వ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా ఉండబోతున్నారు.


Click it and Unblock the Notifications











