‘సైరా’ను చుట్టుముట్టిన సీరియస్ గాసిప్.. వివరణ ఇచ్చిన మెగా టీమ్

By Rajababu

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల బ్యానర్‌పై రూపొందిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఆది నుంచి వివాదాలు, విమర్శలు, గాసిప్స్ వెంటాడుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఓ గాసిప్స్ ఇటీవల మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే దానిపై కొణిదెల బ్యానర్ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ గాసిప్ ఏమిటీ.. దానికి ఏమి వివరణ ఇచ్చారంటే..

నేషనల్ ప్రాజెక్ట్‌గా

నేషనల్ ప్రాజెక్ట్‌గా

సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఓ నేషనల్ ప్రాజెక్ట్‌గా రూపొందించే పనిలో ఉన్నాడు రాంచరణ్. ఈ చిత్రం కోసం పలు భాషలకు చెందిన అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను చెర్రీ రంగంలోకి దించాడు. అయితే ఈ టీమ్ నుంచి సినిమాటోగ్రాఫర్ రవివర్మన్, మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్ వైదొలగిన సంగతి తెలిసిందే.

బిగ్‌బీ గురించి రూమర్

బిగ్‌బీ గురించి రూమర్

అయితే సైరా నరసింహారెడ్డి చిత్రం నుంచి తాజాగా బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ కూడా తప్పుకొన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వార్త ప్రాజెక్ట్‌పై ప్రతికూల ప్రభావం పడే లోపే చిత్ర యూనిట్ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది.

కొణిదల ప్రొడక్షన్ వివరణ

కొణిదల ప్రొడక్షన్ వివరణ

సైరా నరసింహారెడ్డి ప్రాజెక్ట్ నుంచి అమితాబ్ వైదొలగలేదు. ఆ వార్తల్లో వాస్తవం లేదు. అవన్నీ రూమర్లే అని చిత్రం యూనిట్ స్పష్టం చేసింది. ఈ చిత్రం అగ్ర నటులతో షూటింగ్ జరుగుతుంది అని వివరణ ఇచ్చినట్టు సమాచారం.

150 కోట్లతో చిత్రం

150 కోట్లతో చిత్రం

కొణిదెల ప్రొడక్షన్స్‌లో 150 కోట్ల బడ్జెట్‌తో సైరా నరసింహారెడ్డిని రాంచరణ్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్నది. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్, బుర్ర సాయిమాధవ్ వర్మ తదితరులు కథపై కసరత్తు చేస్తున్నారు.

అగ్రనటులు వీరే

అగ్రనటులు వీరే

ఈ చిత్రంలో కన్నడ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్ లాంటి అగ్రనటులు నటిస్తున్నారు. మరో పాత్ర కోసం ఐశ్వర్యరాయ్‌ను కూడా సంప్రదించినట్టు వార్తలు వెలువడ్డాయి

వచ్చే సంక్రాంతికి విడుదల

వచ్చే సంక్రాంతికి విడుదల

అత్యంత సాంకేతిక నైపుణ్యంతో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో గ్రాఫిక్స్ పెద్ద పీట వేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో రాంచరణ్ ఉన్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X