చిరంజీవి సినిమాలో మెగా ట్విస్ట్.. హనీ రోజ్ ఔట్.. కూలీ విలన్ ఇన్!

Mega 158: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'మెగా158'. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'వాల్తేరు వీరయ్య'వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం మొదట మలయాళ నటి హనీ రోజ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. 'వీరసింహారెడ్డి' తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హనీ రోజ్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం భావించిందని టాక్. అంతేకాదు, ఆమెకు కథ కూడా వినిపించారని, ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.

Mega158 Twist Coolie Actress Rachita Ram Replaces Honey Rose in Chiranjeevi-Bobby Kolli Film

అయితే అనూహ్యంగా పరిస్థితులు మారిపోయినట్లు తెలుస్తోంది. డేట్స్ అడ్జస్ట్‌మెంట్ సమస్యలు, ఇతర కమిట్‌మెంట్లు లేదా కథాపరమైన మార్పులు వంటి కారణాల వల్ల హనీ రోజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా, మూవీ మేకర్స్ గానీ, ఆ నటి నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, ఆమె స్థానంలో కన్నడ స్టార్ హీరోయిన్, ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. కూలీ విలన్ రచితా రామ్‌. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రచితా రామ్‌కు అక్కడ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. దాదాపు అన్ని అగ్ర హీరోల సరసన నటించి అనేక విజయాలు అందుకుంది. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో కీలక పాత్ర దక్కించుకోవడం విశేషంగా మారింది. ఇటీవల తమిళ స్టార్ హీరో రజనీకాంత్ నటిస్తున్న 'కూలీ' సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించింది.

అలాంటి టాలెంటెడ్ బ్యూటీ చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. బాబీ కొల్లి ఈ పాత్రను కథలో చాలా కీలకంగా డిజైన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. సినిమా కథలో కీలక మలుపులు తీసుకువచ్చే పాత్రగా, ఎమోషన్స్‌తో పాటు సస్పెన్స్‌ను మోసే క్యారెక్టర్‌గా ఇది ఉండబోతుందని సమాచారం. అందుకే ఈ పాత్ర కోసం సరైన నటిని ఎంపిక చేయడంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక రచితా రామ్‌కు తెలుగు ప్రేక్షకులు కొత్తేమీ కాదు. గతంలో కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కిన 'సూపర్ మచ్చి'సినిమాలో ఆమె కథానాయికగా నటించారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో టాలీవుడ్‌లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం రావడం ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు హనీ రోజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నారనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కేవలం డేట్స్ సమస్యేనా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వాటిని నిర్ధారించలేం. ఏదేమైనా, హనీ రోజ్ స్థానంలో రచితా రామ్ ఎంట్రీ ఇవ్వడం మాత్రం 'మెగా158'కు కొత్త ఆకర్షణగా మారింది. అధికారిక ప్రకటన వెలువడితే ఈ వార్తకు మరింత బలం చేకూరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X