రామ్ చరణ్ కొత్త సినిమా.. కాంబో మామూలుగా లేదుగా.. ప్రకటన ఎప్పుడంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొత్త సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. దసరా సందర్భంగా ఆయన కొత్త సినిమా ప్రకటన రేపు రాబోతోందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆర్ఆర్ఆర్ తో
చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజ్ ఆ సినిమా తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే చాలా గ్యాప్ తీసుకున్న చరణ్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి ఆయన హీరోగా నటిస్తున్నాడు.

రెండు సినిమాలతో బిజీ
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి రామ్ చరణ్ ఈ సినిమా కాకుండా తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య అనే సినిమాలో కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటిస్తుండగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఆచార్య అయ్యాక
ముందు రామ్ చరణ్ పాత్ర చిన్నదే అనుకున్నా రామ్ చరణ్ పాత్ర నిడివి కూడా పెరిగిపోయింది. దీంతో ఆయన ప్రస్తుతం రెండు మల్టీస్టారర్ సినిమాల్లో కనిపించనున్నాడు అనే చెప్పాలి. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఈ రెండు సినిమాలు అయిన వెంటనే ఆయన శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా లాంఛనంగా మొదలు పెట్టగా షూట్ మాత్రం కొద్ది రోజుల్లో మొదలు పెట్టబోతున్నారు.

రామ్ చరణ్ 16 ప్రకటన
ఆ సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ నటించే తర్వాతి సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కు కూడా సమయం ఆసన్నమైందని అంటున్నారు. జరుగుతున్న ప్రచారం మేరకు రామ్ చరణ్ 16 వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమా అధికారిక ప్రకటన రేపు అంటే శుక్రవారం రాబోతోందని తెలుస్తోంది.

రామ్ చరణ్-గౌతమ్ తిన్ననూరి
ఇక ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నారు అని సమాచారం అందుతోంది. నాని జెర్సీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్ అదే కథను బాలీవుడ్ లో తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇక ఆయన రామ్ చరణ్ ను మంచి కథతో ఇంప్రెస్ చేయడంతో ఆ సినిమా పట్టాలు ఎక్కనుందని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోబోతున్నాం సినిమా శంకర్ సినిమా షూట్ మధ్యలో సెట్స్ పైకి వెళుతుందని ప్రచారం జరుగుతోంది.
Recommended Video

రేపు క్లారిటీ
ఇక రామ్ చరణ్ తేజ- శంకర్ కాంబినేషన్ సినిమా పూర్తయిన వెంటనే చాలా మంది దర్శకులతో పని చేస్తారు అని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పటిదాకా ఆయన ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా ఫలానా దర్శకుడితో రామ్ చరణ్ సినిమా రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం మాత్రం కామన్ అయిపోయాయి. ఇక రామ్ చరణ్ తేజ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎవరితో సినిమా చేయబోతున్నారు అనే దాని మీద రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











