ముంబైలో ఖరీదైన బంగ్లా కొన్న రామ్ చరణ్.. గృహప్రవేశం కూడా, అసలు విషయం అదా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన రాబోయే ప్రాజెక్టులైన ఆర్ఆర్ఆర్ మరియు ఆచార్యల బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ షెడ్యూల్ తో చాలా బిజీగా ఉన్నారు. ఈ రోజుల్లో ఎక్కువగా ఆయన ముంబైని కూడా చాలా తరచుగా సందర్శిస్తున్నారు. నివేదికల ప్రకారం, ముంబైలోని ఖార్ లో అనే ప్రాంతంలో రామ్ చరణ్ బీచ్ కు ఎదురుగా ఉన్న విలాసవంతమైన బంగ్లా కొన్నాడని, ఆ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్స్ విషయంలో కూడా ఆయన చాల కేర్ తీసుకుంటుంన్నాడని అంటున్నారు. నిజానికి చరణ్ కి చాలా బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నారని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పనుల కోసం కూడా ఆయన తరచూ అక్కడికి వెళ్ళాల్సి వస్తోంది.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ ముంబైలో తనకంటూ ఒక ప్లేస్ ఉండాలని నిర్ణయించుకున్నాడు, ఎందుకంటే అతను ప్రతిసారీ వసతి కోసం ఒక హోటల్‌లో ఉండాల్సి వస్తోందట. ఇక జరుగుతున్న ప్రచారం మేరకు రామ్ చరణ్ భార్య ఉపాసన ఇప్పటికే ముంబై వెళ్లి అక్కడ గృహప్రవేశం కూడా జరిపినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఒక ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం ముంబై లో ఇల్లు కొనుక్కోవాలని రామ్ చరణ్ ఎప్పటినుండో చూస్తున్నాడని ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం తరచూ ముంబైకి వెళ్లాల్సి రావడంతో ఆయన చాలా ప్లాన్ చేసి మంచి ఏరియాలో బిల్డింగ్ కొన్నాడని పేర్కొన్నారు. మరోపక్క రష్మిక కూడా ముంబైలో ఇల్లు కొనుక్కునే ప్రచారం జరుగుతోంది.

అయితే రామ్ చరణ్ నిజంగా ఇల్లు కొన్నారా లేదా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఆయన గతంలో జంజీర్ సినిమాలో హీరోగా నటించినప్పుడు కూడా ఇలాగే బిల్డింగ్ కొన్నాడని ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో రామ్ చరణ్ మళ్లీ బాలీవుడ్ మీద దృష్టి పెట్ట లేదు. కానీ ఇప్పుడు రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ వస్తుందని భావిస్తూ ఉండడమే కాక శంకర్ తో కూడా మరో పాన్ ఇండియా సినిమా చేస్తూ ఉండడంతో ఆయన బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారా అనే అనుమానాలు మాత్రం కలుగుతున్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











