మరో అగ్ర దర్శకుడిని లైన్ లో పెట్టిన మెగాస్టార్ చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా చేసినా కూడా జెట్ స్పీడ్ లో పూర్తి చేయాలన్న టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాతో సాలీడ్ గా రెడీ అవుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. ఆచార్య అనంతరం లూసిఫర్ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
కరోనా గోల లేకపోయి ఉంటే ఈపాటికే ఆచార్య సందడి ఒక రేంజ్ లో ఉండేది. ఇక మెహర్ రమేష్, బాబీ వంటి వారితో కూడా సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం మురగదాస్ - మెగాస్టార్ కాంబో మరోసారి సెట్టయ్యేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. 2006లో వచ్చిన స్టాలిన్ మూవీతో వచ్చిన ఈ కాంబో ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది.

ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాకపోయినప్పటికి మెగాస్టార్ తో మరో సినిమా చేయాలని మురగదాస్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం అగ్ర హీరోలతో అవకాశాలు అందుకోలేక కాస్త సతమతమవుతున్న మురగదాస్ మళ్ళీ మెగాస్టార్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక మెగాస్టార్ ను కథతో మెప్పిస్తే ఎంత బిజీగా ఉన్నా కూడా ఒప్పేసుకుంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











