Acharya Release Date: మరో డేట్ పై ఫోకస్ పెట్టిన మెగాస్టార్.. కాస్త ముందుగానే?

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే కొత్త మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అనంతరం ఒక్కసారిగా స్పీడ్ పెంచిన మెగాస్టార్ చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. దాదాపు అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. కేవలం ఒకటి రెండు సాంగ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. రామ్ చరణ్ తేజ్ కూడా ఈ సినిమాలో సిద్దా ఆన్స్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాతో మెగాస్టార్ ఎలాగైనా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నారు. మెగా అభిమానుల్లో అయితే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా విడుదలైతే ఒపెనింగ్స్ మామూలుగా ఉండవని చెప్పవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారిగా కలిసి నటిస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. అసలైతే దసరా సమయానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు కూడా అందుబాటులో లేకపోవడం వలన మెగాస్టార్ ఆచార్య విడుదల తేదీని వెయిటింగ్ లిస్టులో పెట్టాల్సి వచ్చింది.

Megastar chiranjeevi Acharya movie new release date

సరైన సమయంలోనే ఈ సినిమాను విడుదల చేయాలని రామ్ చరణ్ కూడా ఎంతో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదివరకే కొన్ని సార్లు కొరటాలశివ హీరోలతో కలిసి విడుదల తేదీ పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అవసరమైతే వచ్చే ఏడాది కూడా కొత్త డేట్ ఫిక్స్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద అగ్రహీరోలు ముందుగానే పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు RRR కూడా సంక్రాంతికి రాబోతున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. పొంగల్ ఫెస్టివల్ లో పోటీ పడటం చాలా రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి అంతకంటే ముందే విడుదల చేయాలని అనుకుంటున్నారట.

మొన్నటి వరకు కూడా ఆచార్య డిసెంబర్ 24న విడుదల చేయాలని అనుకున్నారు. ఇక లేటెస్ట్ గా మరొక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందే విడుదల చేస్తే క్రిస్మస్ సెలవులు కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కు ఉపయోగపడతాయని డిసెంబర్ 17ను ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి సినిమా అప్పుడైనా సరే అనుకున్న సమయానికి వస్తుందో లేదో చూడాలి. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ సినిమా తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే అలాగే బాబీ, మెహర్ రమేష్ సినిమాను ఇదే ఏడాది మొదలు పెట్టబోతున్నారు. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం. ఒకవేళ ఆలస్యమైతే మెహర్ రమేష్ బోళా శంకర్ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X