మెగాస్టార్ ఆచార్యకు మరో దెబ్బ.. షూటింగ్ మరింత ఆలస్యం?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఓటమిలేని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ ఏ క్షణాన మొదలైందో తెలియదు గాని ఊహించని విధంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా మెగాస్టార్ సినిమా చాలా ఆలస్యం అయ్యిందనే చెప్పాలి.
అసలైతే ఈ పాటికే సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ముందు నుంచి సినిమాకు హీరోయిన్ విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. త్రిషను సెలెక్ట్ చేసుకుందామని అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. మొత్తానికి కాజల్ అగర్వాల్ ని సెట్ చేశారు. ఇకపోతే ఇటీవల ఆచార్య షూటింగ్ కి మరో ఇబ్బంది తలెత్తినట్లు తెలుస్తోంది.

సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సింహాచలం సెట్ వర్షం ధాటికి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు రావడంతో ఆ సెట్ కొంచెం దెబ్బతిందట. దీంతో రామ్ చరణ్ మళ్ళీ కొంత ఖర్చుతో మరమ్మత్తులు చెయిస్తున్నట్టు తెలుస్తోంది. సెట్ మొత్తం మళ్ళీ సిద్దమైన తరువాతే షూటింగ్ స్టార్ట్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











