twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya సెటిల్మెంట్ లో దర్శకుడికి అండగా హీరోలు.. ఎంత ఇచ్చారంటే?

    |

    టాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఊహించని విధంగా అందరిని ఆశ్చర్యపరిచే విధంగా డిజాస్టర్ అయిన సినిమా ఆచార్య. అంతవరకు ఓటమి చూడని కొరటాల శివ బాక్సాఫీస్ వద్ద మినిమమ్ అనే రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడు అని అందరు అనుకున్నారు. కానీ ఆచార్య సినిమా ఇండస్ట్రీ మొత్తంలోనే అత్యధిక నష్టాలను కలిగించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన సెటిల్మెంట్స్ లో కొరటాల శివపై తీవ్రమైన ఒత్తిడి పడడంతో మెగా హీరోలు కూడా అండగా నిలబడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ..

    ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ..

    మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఆచార్య సినిమాలో మొదటిసారి రామ్ చరణ్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు. సినిమా అవుట్ ఫుట్ పై కూడా చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతోనే విడుదల చేసింది. ఇక విడుదల రోజు నుంచే కలెక్షన్లు ఒక్కసారిగా తగ్గుతూ వచ్చాయి.

    అత్యధిక నష్టాలు

    అత్యధిక నష్టాలు

    ఆచార్య సినిమా బడ్జెట్ కారణంగా మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో రెమ్యునరేషన్ అయితే తీసుకోలేదని నిర్మాత నిరంజన్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆచార్య సినిమా దాదాపు 70కోట్లకు పైగానే నష్టాలను మిగిల్చినట్లు సమాచారం. పెట్టిన పెట్టుబడిలో చాలా వరకు బయ్యర్లు నష్టపోయినట్లు టాక్ అయితే వచ్చింది.

     సక్సెస్ అయ్యి ఉంటే..

    సక్సెస్ అయ్యి ఉంటే..

    డైరెక్టర్ కొరటాల శివ కూడా పెద్దగా రెమ్యునరేషన్ ఏమి తీసుకోకుండానే బిజినెస్ వ్యవహారాలలో మాత్రం నిర్మాతలతో కొన్ని డీలింగ్స్ సెట్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం కొరటాల శివ ఆధ్వర్యంలోనే కొనసాగినట్లు తెలుస్తోంది. ఒక వేళ సక్సెస్ అయితే కొరటాల భారీ స్థాయిలో లాభాల్లో షేర్ వచ్చేది. కానీ డిజాస్టర్ కావడంతో కొరటాల సమక్షంలో సినిమా థియేట్రికల్ హక్కులను కొన్న వారందరు కూడా అతని ఆఫీస్ కే వస్తున్నారు.

    స్థలం అమ్మేసిన కొరటాల శివ

    స్థలం అమ్మేసిన కొరటాల శివ

    ఇక ఈ క్రమంలో కొరటాల శివపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగినట్లు టాక్ అయితే గట్టిగానే వస్తోంది. కొంతమంది బయ్యర్లు తరచుగా కొరటాల ఆఫీస్ కు రావడం రెండు మూడు రోజులు అక్కడే ఉండడంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్ పై కూడా సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారట. ఇక ఆ టెన్షన్ నుంచి బయట పడేందుకు కొరటాల శివ దాదాపు 40 కోట్ల విలువ గల ఒక స్థలాన్ని కూడా అమ్మేసి బయ్యర్లకు ఇచ్చినట్లు ఒక టాక్ అయితే వస్తోంది.

    అడ్వాన్స్ తిరిగిచ్చేసిన హీరోలు

    అడ్వాన్స్ తిరిగిచ్చేసిన హీరోలు

    అయితే కొరటాల శివ పరిస్థితి గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందించి అండగా నిలిచినట్లు సమాచారం. చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఇదివరకే నిర్మాత దగ్గర నుంచి తీసుకున్న 20 కోట్ల అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేశారట. అంటే ఆచార్య కారణంగా కొరటాల తన డబ్బు కూడా కోల్పోగా ఇప్పుడు హీరోలు ఇద్దరు కూడా ఆచార్య ద్వారా అందుకున్న అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. అంటే సినిమాతో వారికి ఏమి రానట్లే లెక్క. పైగా ఫ్రీగా సినిమా చేసినట్లు లెక్క. మరి రాబోయే సినిమాలతో కొరటాల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

    English summary
    Megastar chiranjeevi and ram charan also support to koratala siva in acharya issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X