మెగాస్టార్ లిస్ట్ లో మరో యువ దర్శకుడు.. పాతికేళ్ల హీరోయిన్ తో జోడి!

మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చకచకా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆయన కెరీర్ మొదట్లోనే వరుసగా పది సినిమాలకు పైగా లైన్ లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే మెగాస్టార్ గా గుర్తింపు వచ్చిన తర్వాత మాత్రం చిరంజీవి వీలైనంత వరకు ఒక సినిమా తర్వాత మరొక సినిమాలు పూర్తి చేసుకుంటూ వచ్చాడు. ఇక మార్కెట్ స్థాయి కూడా అంతకంతకు పెరిగినకొద్దీ ప్రాజెక్టులు ఏడాదికి ఒకటి మాత్రమే పూర్తి చేయాల్సి వచ్చింది. అయితే కరోనా లాక్డౌన్ తర్వాత మాత్రం మెగాస్టార్ ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. ప్రస్తుతం మరొక సినిమా ఓకే చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వాయిదాల పర్వం..

వాయిదాల పర్వం..

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా అనంతరం చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అసలైతే ఆచార్య నిర్మాణం గత ఏడాది మొదట్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా ప్రభావం వలన ఆ సినిమా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడింది. అంతేకాకుండా థియేటర్లో టికెట్ల రేట్ల సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఇక పండగ సమయంలో మిగతా సినిమాలతో పోటీ పడడం ఎవరికీ మంచిది కాదు అని వాయిదా వేసుకోక తప్పలేదు. మొత్తానికి ఆచార్య సినిమాలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

వీలైనంత త్వరగా పూర్తి చేయాలని

వీలైనంత త్వరగా పూర్తి చేయాలని

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీ అయ్యారు. ముందుగా గాడ్ ఫాదర్ ను సెట్స్ పైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక మెగాస్టార్ కూడా కొన్ని మార్పులతో తనదైన శైలిలో ప్రాజేంట్ చేయాలని అనుకుంటున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మెగాస్టార్ ఫిక్స్ అయ్యారు.

 మరొక రీమేక్..

మరొక రీమేక్..

ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని మెగాస్టార్ చిరంజీవి ముందుగానే దర్శకులతో నిర్మాతలతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నారు. రీసెంట్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో మరొక రీమేక్ సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమా కూడా తొందరగానే ఫినిష్ అవుతుంది. ఇక బాబి దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

యువ దర్శకుడితో చర్చలు

యువ దర్శకుడితో చర్చలు

మెగాస్టార్ చిరంజీవి మరొక యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మారుతి గోపీచంద్ మలినేని వంటి దర్శకులతో కూడా మెగాస్టార్ కొన్ని కథల పై చర్చలు జరిపారు. వారు కూడా భవిష్యత్తులో వర్క్ అవకాశం ఉంది. ఇక రీసెంట్ గా యువ దర్శకుడు వెంకీ కుడుములతో కూడా ఒక కధ పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఛలో, భీష్మ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న వెంకీ కుడుముల తన తదుపరి సినిమా స్టార్ హీరోతోనే చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ కోసం కూడా ఒక కథను వినిపించాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక మెగాస్టార్ మాత్రం అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Recommended Video

Latest Tollywood Updates : ఇన్నేళ్లకు మళ్లీ Chiranjeevi సినిమాలో నటిస్తున్న రమ్యకృష్ణ!
మెగాస్టార్ తో రష్మిక మందన్న

మెగాస్టార్ తో రష్మిక మందన్న

అయితే మెగాస్టార్ కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం ముందుగానే ఒక హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు రష్మిక మందన్న అని తెలుస్తోంది. ఆరు పదుల వయసు దాటినా మెగాస్టార్ చిరంజీవికి పాతికేళ్ళ వయసున్న రష్మిక ఎంతవరకు సెట్ అవుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే మెగాస్టార్ మాత్రం సినిమా కు తగ్గట్టుగా తన వయసు కనిపించకుండా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాడు. మరి వెంకీ కుడుముల సినిమాతో ఎంత వరకు మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X