పవన్ చేయాలనుకున్న సినిమాలో మెగాస్టార్.. ఆ దర్శకుడు న్యాయం చేయగలడా?
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా చేసినా కూడా దానికి సరైన న్యాయం చేయగలరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఖైదీ నెంబర్ 150సినిమాతో యంగ్ లూక్ లుక్ లో కనిపించి అందరికి సరికోత్త కిక్కిచ్చారు. అయితే నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండాలని మెగాస్టార్ చాలా పదునైన ప్లాన్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకి సంబంధించిన స్పెషల్ సర్ ప్రైజ్ ఈ నెల 22న మెగాస్టార్ 65వ పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారు. అయితే అదే రోజున మరో రెండు ప్రాజెక్టుల ఎనౌన్స్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న సినిమాలో..
మెగాస్టార్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా తమిళ్ 'వేదళం' సినిమాకు రీమేక్ గా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అజిత్ నటించిన వేదళంలో ముందు పవన్ కళ్యాణ్ నటించాలని అనుకున్నాడు.

ఆ దర్శకుడు న్యాయం చేయగలడా?
కానీ రాజకీయాలతో బిజీ కావడం వల్ల పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఆ కథ కోసం మెగాస్టార్ చిరంజీవి రెడీ అయ్యే అవకాశం ఉందని టాక్. ఇక ఆ మాస్ యాక్షన్ సినిమాకు మెహర్ రమేష్ ఎంతవరకు న్యాయం చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ దర్శకుడు ఇంతకుముందు ఊహించని డిజాస్టర్స్ అందుకున్నాడు.
Recommended Video

ఎవరు ఎన్ని చెప్పినా కూడా
శక్తి, షాడో వంటి సినిమాలను భారీ బడ్జెట్ లో తెరకెక్కించిన రమేష్ ఎలాంటి రిజల్ట్ ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అలాంటి స్థాయిలో డిజాస్టర్స్ చూసిన ఈ దర్శకుడు మెగాస్టార్ స్థాయికి తగ్గట్లు ఈ సారి సరైన న్యాయం చేయగలడా అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మెగాస్టార్ మాత్రం ఆ దర్శకుడిపై చాలా నమ్మకంతో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











