విజయ్ దేవరకొండ కోసం చిరు వస్తాడా!

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం గీత గోవిందం. యువతలో హాట్ టాపిక్ గా మారిన రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. బన్నీ వాసు ఈ చిత్రానికి నిర్మాత.

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఉంది. ఆడియో వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిధిగా హాజరైన సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi to attend Geetha Govindam Pre release event

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12 న వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుందట. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ వేడుకకు మెగాస్టార్ చిరు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X