twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    13 ఏళ్ళ తర్వాత అలా కనిపించబోతున్న చిరంజీవి.. ఆ బడా సంస్థతో ఒప్పందం?

    |

    మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఆయన పలు సేవా కార్యక్రమాలలో కూడా తరచుగా పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నేటి తరం యువ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాకుండా మెగాస్టార్ చిరంజీవి వర్క్ చేస్తున్న విధానం అందరిని ఆశ్చర్యానికి కలుగజేస్తుంది. ఇక ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి 13 ఏళ్ల అనంతరం ఒక బ్రాండ్ ప్రమోషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ బ్రాండ్ ప్రమోషన్ లో నటించేందుకు ఆయనకు భారీ స్థాయిలో పారితోషికం ఇవ్వనున్నట్లుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

     వరుసగా సినిమాలు

    వరుసగా సినిమాలు

    మెగాస్టార్ చిరంజీవి కొన్నేళ్ల అనంతరం ఖైదీ నెంబర్ 150 సినిమా రీ ఎంట్రీ ఇచ్చి తనలోని గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆ సినిమాతో ఆయన ఇమేజ్ కూడా ఏ మాత్రం తగ్గలేదు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు. సైరా సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన మార్కెట్ స్థాయి కూడా అమాంతం పెరిగి పోయింది.

    అప్పట్లో భారీ స్థాయిలో..

    అప్పట్లో భారీ స్థాయిలో..

    ఇక ప్రస్తుతం ఏకంగా ఆయన నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. మరి కొన్ని సినిమాలను కూడా త్వరలోనే ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు మెగాస్టార్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు కంపెనీలకు ప్రచారకర్తగా కూడా వ్యవహరించారు. యాడ్స్ షూటింగ్ లతో కూడా చాలా బిజీగా కనిపించేవారు. ముఖ్యంగా మెగాస్టార్ అప్పట్లో భారీ స్థాయిలో పారితోషికం అందుకున్నారు కూడా.

    చాలా గ్యాప్ అనంతరం

    చాలా గ్యాప్ అనంతరం

    తెలుగులో అప్పట్లో అత్యధికంగా బ్రాండ్ ప్రమోషన్ ద్వారా రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా మెగాస్టార్ చిరంజీవి గుర్తింపును అందుకున్నారు. ఇక మళ్లీ రాజకీయాలకు వెళ్లిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి అలాంటి వాటికి గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్ యాడ్స్ కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

    బడా రియల్ ఎస్టేట్ సంస్థతో..

    బడా రియల్ ఎస్టేట్ సంస్థతో..

    ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఒక సంస్థతో బ్రాండ్ ప్రమోషన్ కోసం చేతులు కలిపినట్లు సమాచారం. అసలైతే గతంలో మెగాస్టార్ చిరంజీవికి నేషనల్ కంపెనీలు ఆఫర్స్ చేశాయి. కానీ అలాంటివి నటించకూడదని మెగాస్టార్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ ఎవరో ఒకరు నిత్యం మెగాస్టార్ చిరంజీవి ని సంప్రదించెందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

    Recommended Video

    Acharya Movie : Megastar Chiranjeevi Top 10 Highest Collected Movies | Tollywood | Filmibeat Telugu
     భారీగా రెమ్యునరేషన్..

    భారీగా రెమ్యునరేషన్..

    ప్రస్తుతం రామ్ చరణ్ కూడా ప్రైవేట్ యాడ్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తప్పకుండా ఆయనతో ప్రమోషన్ చేయిస్తే మంచి బజ్ ఉంటుంది అని అందరికీ తెలుసు. ఇక రీసెంట్ గా ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మెగాస్టార్ తో ఒప్పందం కుదుర్చుకుని ప్రమోషన్ షూట్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. అందుకోసం ఆయన భారీ స్థాయిలో పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం. దాదాపు పది కోట్ల వరకు పారితోషికం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక నిమిషం మాత్రమే ఉండే ఆ బ్రాండ్ ప్రమోషన్ వీడియో కోసం మెగాస్టార్ చిరంజీవి ఈ వారమే షూట్ చేసేందుకు సిద్ధమైనట్లు టాక్.

    English summary
    Megastar chiranjeevi brand promoting for after 13 years,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X