100కోట్ల ప్రాజెక్ట్.. సక్సెస్ ఇవ్వకపోయినా యువ దర్శకుడిని నమ్ముతున్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ మాత్రం బ్రేక్ తీసుకోవడం లేదు. ఆరు పదుల వయసులోకి వచ్చి నాలుగేళ్లవుతున్న ఇంకా యువ చిరంజీవిలానే మంచి ఎనర్జితో సినిమాలు చేస్తున్నారు. సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడం మెగాస్టార్ ని కాస్త నిరాశకు గురి చేసింది. పాన్ ఇండియా లెవెల్లో సినిమాను రిలీజ్ చేశారు గాని వర్కవుట్ కాలేదు. దీంతో తదుపరి సినిమాతో అయినా మంచి బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని మెగాస్టార్ అడుగులు వేస్తున్నారు.

ఆచార్యతో బిజీ బిజీ..
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఆచార్య సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ కొంత పూర్తయ్యింది. ఇక లాక్ డౌన్ కారణంగా షూటింగ్ పనులకు బ్రేక్ వేసిన చిత్ర యూనిట్ రెగ్యులర్ గా చిరంజీవితో టచ్ లో ఉంటుందట. కొరటాల శివ సినిమాకు సంబంధించిన సీన్స్ పై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. అలాగే మణిశర్మతో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా వేస్తున్నట్లు సమాచారం.

లూసిఫర్ ప్లానింగ్..
మలయాళం సూపర్ హిట్ మూవీ లుసిఫర్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తెలుగులో రిలీజ్ అయినప్పటికీ మార్పులు చేసి కొత్త తరహాలో స్క్రీన్ ప్లేను చేంజ్ చేస్తే ఇంకా బావుంటుందని రామ్ చరణ్ ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ రెడీ అవుతోంది.

యువ దర్శకుడిపైనే మెగాస్టార్ నమ్మకం..
లూసిఫర్ రీమేక్ కథను కొత్తగా ఎవరు ట్రై చేస్తారన్న సమయంలో ఎంతో మంది దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ రామ్ చరణ్ ఊహించని విధంగా యువ దర్శకుడైన సుజిత్ ని ఎంచుకున్నట్లు టాక్ వచ్చింది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ అది నిజమేనని ఒక క్లారిటీ ఇచ్చేశారు. అదే విధంగా దర్శకుడు కథను తనదైన శైలిలో కొత్తగా రాసుకుంటున్నట్లు చెబుతూ.. తప్పకుండా అతను ఆ సినిమాకు న్యాయం చేయగలడని మెగాస్టార్ నమ్మకంగా చెబుతున్నారు.
Recommended Video

100కోట్ల ప్రాజెక్ట్..
దర్శకుడిగా సుజిత్ ని ఎంచుకోవడం ఒక విధంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే సాహూ సినిమా కోసం భారీగా ఖర్చు చేయించిన సుజిత్ అంచనాలకు తగ్గట్టుగా ఆ సినిమాను ప్రజెంట్ చేయలేకపోయాడు. సాహూ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆ దెబ్బకు కొన్నాళ్ల పాటు సుజిత్ బయటకు రాలేదు. ఇక ఇప్పుడు 100కోట్లకు పైగా ఖర్చు చేసి లూసిఫర్ ను నిర్మించాలని అనుకుంటున్న మెగా హీరోస్ అతన్ని అంతగా నమ్మడం సాహసమనే చెప్పాలి. మరి సుజిత్ ఈసారైనా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











