మరోసారి మెగాస్టార్ డబుల్ యాక్షన్ .. ఆ పాత్ర కోసం స్పెషల్ వర్కౌట్స్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో డబుల్ యాక్షన్ సినిమాలు చాలానే వచ్చాయి. అయితే అందులో సక్సెస్ అయిన సినిమాలతో పాటు ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మెగాస్టార్ డబుల్ యాక్షన్ అనగానే ఒక స్పెషల్ ఆసక్తి నెలకొంటుంది. ఇక త్వరలో మరో డ్యూయల్ రోల్ తో మెగాస్టార్ ఉహీంచని సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో మెగాస్టార్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నట్లు మొదటి నుంచి ఒక టాక్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ లో ఒక మాదిరిగా అలాగే సెకండ్ హాఫ్ లో మరో లుక్ తో కనిపిస్తాడని తెలిసింది. అయితే ఒక్కడే రెండు గెటప్స్ లో కనిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ నిజానికి ఇద్దరు మెగాస్టార్లు కనిపించనున్నారని టాక్ వస్తోంది.

Megastar chiranjeevi double role in acharya movie

ఒక పాత్ర కోసం బరువు తగ్గాలని ఇప్పటికే స్పెషల్ గా వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక రామ్ చరణ్ ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ ఉంటుందా లేదా అనే విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మొన్నటివరకు దాదాపు ఫిక్స్ అయినట్లే అనే టాక్ వచ్చింది.

కానీ ఆ తరువాత మెగాస్టార్ ఆలోచన మేరకు కొరటాల రామ్ చరణ్ పాత్రను తీసేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే 40% శాతం షూటింగ్ పనులను పూర్తి చేసిన కొరటాల కరోనా అదుపులోకి వచ్చిన తరువాత మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X