మరొక రీమేక్ పై ఫోకస్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. మళ్ళీ రామ్ చరణ్ తోనే..

నటుడు చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్ ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ కొనసాగుతున్నారు. అంతకముందు కొన్నేళ్ల వరకు కూడా రాజకీయ రంగంలో గడిపిన మెగాస్టార్, ఆ తరువాత వివి వినాయక్ తీసిన ఖైదీ నెంబర్ 150 సినిమా తో హీరోగా మళ్ళి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టారు. ఆ మూవీతో సూపర్ హిట్ కొట్టిన అనంతరం కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా తన పవర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన సైరా నరసింహారెడ్డి భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో కూడా మెగాస్టార్ చిరంజీవి మంచి క్రేజ్ అందుకున్నారు.

ఇక దాని తరువాత మొత్తం నాలుగు సినిమాలు లైన్లో పెట్టిన మెగాస్టార్ వాటిలో ఆచార్య సినిమాని ఆల్ మోస్ట్ పూర్తి చేసారు. కెరీర్ లో ఫస్ట్ టైం తనయుడు చరణ్ తో కలిసి నటిస్తున్న చిరంజీవి, ఈ మూవీలో నక్సలైట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇటీవల గాడ్ ఫాదర్ ని లాంచ్ చేసిన మెగాస్టార్, త్వరలో మెహర్ రమేష్ తో భోళా శంకర్ అలానే బాబీ దర్శకత్వంలో మరొక సినిమా సెట్స్ పైకి తెనున్న విషయం తెలిసిందే.

Megastar chiranjeevi focus on another tamil remake movie,

అయితే వీటిలో మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతుండగా, తమిళ మూవీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ రూపొందనుంది. ఇటీవల అఫీషియల్ గా ప్రకటనలు వచ్చిన ఈ సినిమాలపై మెగా ఫ్యాన్స్ తో పాటు మిగతా ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల న్యూస్ ప్రకారం వీటి తరువాత మరొక రీమేక్ మూవీలో మెగాస్టార్ యాక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఆరేళ్ళ క్రితం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ ఎన్నై అరిందాల్ అనే తమిళ్ సినిమాని తెలుగులో త్వరలో రీమేక్ చేయనున్నారట. అయితే ఆ సినిమా తెలుగులో 'ఎంతవాడు గాని' పేరు తో డబ్ అయింది కూడా. అయినప్పటికీ రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నారట.

అయితే ఈ సినిమా తెలుగు హక్కులు ఇప్పటికే కొనుగోలు చేసిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ప్రస్తుతం దీని తెలుగు వర్షన్ తీయనున్న దర్శకుడి కోసం ప్రయత్నాలు చేస్తోందట. రామ్ చరణ్ ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మరొక యువ నటుడు కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్. కాప్ స్టోరీ డ్రామా యాక్షన్ అంశాలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజం అయితే చాలా గ్యాప్ తరువాత మరొక్కసారి మెగాస్టార్ ని పోలీస్ అధికారి పాత్రలో చూడవచ్చని చెప్పవచ్చు. అలాగే మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు టాక్ అయితే వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X