twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ చిరంజీవి..యానిమేషన్ హీరోగా?

    By Srikanya
    |

    చిరంజీవి తాను వెండితెరపై కనిపించనని చెప్పారు. అయితే ఆయనతో యానిమేషన్ ఫిల్మ్ చేస్తే ఎట్లా ఉంటుంది..క్రేజ్ కి ఎలానో ఇబ్బంది ఉండదు అని కొందరు ఔత్సాహికులకు ఐడియా వచ్చి కలిసారని, పూర్తి ప్రాజెక్టు రిపోర్టు తో వస్తామని చెప్పినట్లు సమాచారం. ఇదంతా ఎందుకంటే త్వరలో రజనీకాంత్ సుల్తాన్ ది వారియర్ పేరుతో ఓ యానిమేషన్ తో వస్తున్నారు. ఆయన కుమార్తె సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరో ప్రక్క ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ త్వరలో Twinergy టైటిల్ తో ఓ యానిమేషన్ ఫిల్మ్ చేయనున్నారు. అయితే ఈ యానిమేషన్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో అమితాబ్ యానిమేషన్ లో కనపడతారు. అంతేగాక ఆ యానిమేషన్ కి అమితాబ్ స్వయంగా డబ్బింగ్ చెపుతారు. ఏబి కార్పోరేషన్, టూన్స్ ఇండియా వారు కలిపి ఈ యానిమేషన్ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారు. దీపావళికి ఇది రెడీ అవుతుంది. ఇలా మెగా హీరోలంతా తమని తాము ఏనిమోషనన్ లో చూసుకోవటానికి ఉత్సాహపడుతున్నారు. ఈ మూడ్ లో మన మెగాస్టార్ కూడా పచ్చజెండా ఊపితే ఏముంది ఆయన్ని యానిమేషన్ లో చూడచ్చు ఏమంటారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X