Balayya-Chiranjeevi: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఓకే స్క్రీన్‌పై బాలయ్య, చిరు... ఎప్పుడంటే?

బిగ్ స్క్రీన్ పై చిరంజీవి, బాలయ్య కలిసి నటిస్తే చూడాలను చాలా మంది అనుకుంటారు. వీరిద్దరూ కలిసి నటించాలని ఫ్యాన్స్ అయితే ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అయితే వీరిద్దరి డ్రీమ్ కొద్ది రోజుల్లో నిజం కానుంది. కానీ అది బిగ్ స్క్రీన్ పై కాదు... అలా అని అది మూవీ కాదు... బాలయ్య అన్ స్టాపబుల్ షో ఎంత సక్సెస్ అయిందో చెప్పనక్కర లేదు. ఇప్పుడు ఈ షో సీజన్ 3 ప్రారంభం కానుందట. ఇక ఈ షోలో మొదటి ఎపిసోడ్ బాలయ్య, చిరు కలిసి చేయనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...

నందమూరి నట సింహం బాలయ్య బాబు, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటిస్తే చూడాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కు పండగలాంటి న్యూస్ బయటకు వచ్చింది. వీరిద్దరూ కలిసి ఓకే స్క్రీన్ పై సందడి చేయనున్నారు. అయితే వీరిద్దరు ఓకే స్క్రీన్ పై కనిపిస్తారు కానీ.. బిగ్ స్క్రీన్ పై మాత్రంకాదట.

Megastar Chiranjeevi is a guest on Aha Balayya Unstoppable season 3 show News Goes Viral

ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్ షోతో ఎలాంటి సంచలనం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ షోకి ముందు బాలయ్య అంటే... కోపిస్టి.. ఫైర్ మీద ఉంటారు.. ఏం మాట్లాడుతారో అంటూ కామెంట్స్ వినిపించాయి. ఇక ఈ షో తో ఆయన సాఫ్ట్ అండ్ కూల్ అని అర్ధం అయింది. బాలయ్య అంటే భోళా శంకరుడని అందరికీ అర్ధం అయింది.

ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ సక్సెస్ కావడంతో... రెండో సీజన్ కూడా తీశారు. ఇక రెండో సీజన్ కూడా సూపర్ హిట్టు గా నిలిచింది. ఆహా కు ఐకానిక్ ప్రోగ్రామ్ గా బాలయ్య అన్ స్టాపబుల్ షో మారింది. ఇప్పుడు సీజన్ 3 ప్లాన్ చేయడం లేదు... కానీ కొన్ని స్పెషల్ ఇంటర్వూలు ప్లాన్ చేసి.. స్పెషల్ ఎపిసోడ్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

అందులో భాగంగానే... చిరంజీవిని గెస్ట్ గా తీసుకువచ్చి.. బాలయ్యతో షో చేయించనున్నారట. ఈ మేరకు అల్లు అరవింద్ బిగ్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఆయన ఈ విషయంలో చేసిన ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యాయంట. బాలయ్య, చిరు డేట్ లు సెట్ అయితే ఈ ఎపిసోడ్ తయారు చేసి... దసరా లేదా న్యూ ఇయర్ కు క్రేజీ ఎపిసోడ్ రిలీజ్ చేయాలని ఆహా ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.

ఇదే గనుక ఓటీటీ వేదికపై ప్రసారం అయితే మాత్రం సెన్సెషన్ క్రియేట్ అవ్వుద్ది అనడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. మరోవైపు చిరంజీవి కూడా రెండు సినిమాలను తన బర్త్ డే కానుకగా ప్రకటించారు. డైరెక్టర్ వశిష్టతో ఓ మూవీ చేస్తుండగా... తన కూతురు నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X