Chirajeevi Trivikram Movie: ఖైదీ సినిమాకు సీక్వెల్... గురూజీతో చిరంజీవి గూడుపుఠాణి
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇటీవల ఆయన భోళా శంకర్ సినిమాతో కాస్త స్లో అయినా... మళ్లీ ఆయన లైనప్ చూస్తే.. మెగా ఫ్యాన్స్ లో ఫుల్ ఖుషి అవుతారు. ఇప్పటికే కూతురి నిర్మాణంలో ఒక మూవీ, దర్శకుడు వశిష్ట్ తో మరో మూవీ చేయనున్నారు.
ఇక ఆయన తన నెక్ట్స్ మూవీ గురూజీతో చేయనున్నారట. అది కూడా ఖైదీ సినిమాకు సీక్వెల్. అసలు ఆయన ఈ సినిమాకు సీక్వెల్ ఎందుకు చేయబోతున్నారు.. గురూజీతో ఎంత వరకు మంతనాలు వచ్చాయి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చిరు కెరియర్ లో మైల్ స్టోన్: చిరంజీవి కెరియర్ లో మైలురాయిగా నిలిచిన చిత్రం ఖైదీ. ఇక ఈ సినిమా 1983లో విడుదల అయి సెన్సెషన్ సృష్టించింది. ఇక ఈ సినిమాలో సుమలత, మాధవి హీరోయిన్లుగా నటించగా... రావు గోపాల్ రావు, చలపతి రావు, రంగనాథ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో సిల్క్ స్మిత కూడా ఓ ఐటెం సాంగ్ చేసింది. ఇక అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.

పాతిక లక్షలు పెడితే... 8 కోట్లు వచ్చింది: కేవలం పాతిక లక్షలతో ఖైదీ సినిమాను నిర్మిస్తే...8 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద వసూలు అయ్యాయి. ఇక ఖైదీ సినిమాకు కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు ఖైదీ సినిమాకు సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది. అది కూడా గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతుందని మెగా కాంపౌండ్ వర్గాల సమాచారం. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథను సిద్ధం చేయాలని చిరంజీవి స్వయంగా గురూజీకి చెప్పారట.

ఖైదీ సీక్వెల్ కథపై కసరత్తు: ఇక ఖైదీ మూవీకి సీక్వెల్ స్టోరీ సిద్ధం చేసే పనిలో త్రివిక్రమ్ పడ్డారని తెలుస్తోంది. ఇక ఇప్పుడున్న దర్శకుల్లో త్రివిక్రమ్ అయితేనే... ఖైదీ లాంటి స్టోరీని సిద్ధం చేయగలరని చిరంజీవి నమ్మి... గురూజీకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ స్టోరీ ఇప్పటి జనరేషన్ కు తగ్గట్లో... ఆయన పాత్ర కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటుందని సమాచారం. ఇప్పటికే కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

గురూజీకి చిరు సూచనలు: ఇటీవల త్రివిక్రమ్, చిరంజీవి మధ్య ఖైదీ సినిమా సీక్వెల్ ఎలా ఉండాలో చర్చలు కూడా జరిగాయని మెగా కాంపౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కావాల్సినంత సమయం తీసుకుని మంచి కథతో రావాలని గురూజీకి చిరు సూచించారు అని సమాచారం. ఇక ప్రస్తుతం గురూజీ మహేశ్ బాబుతో గుంటూరు కారం పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానంది.

ఆ సినిమాల తర్వాతే ఖైదీ సీక్వెల్: గుంటూరు కారం సినిమా తర్వాత గురూజీ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తారని తెలుస్తోంది. మరి చిరుంజీవి కూడా తన కూతురి నిర్మాణఁలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయనున్నారు. ఇప్పటికే క్యాస్ట్ అండ్ క్రూ కూడా ప్రకటించారు. ఈ సినిమాలో శర్వానంద్, త్రిష నటించనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బింబిసార దర్శకుడు వశిష్ట్ తో కూడా ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాతే ఖైదీ సీక్వెల్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











