మెగాస్టార్, కొరటాల సినిమాకు ముహూర్తం, ఆ మూడింటిని మించేలా.. రాంచరణ్ వదులుతాడా!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరు తదుపరి క్రేజీ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజగా ఈ కాంబినేషన్ గురించి ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది.

అపజయాలు ఎరుగని దర్శకుడు
కొరటాల శివ రచయితగా అనేక విజయాలు అందుకున్నారు. మిర్చి చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తరువాత ఇక కొరటాల శివ వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా శ్రీమంతుడు, జనతా గారేజ్, భరత్ అనే నేను చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా సంగతి తెలిసిందే.

క్రేజీ కాంబినేషన్
కొరటాల శివ తదుపరి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు అనే వార్త తెలియగానే సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కొరటాల శివ చిరు కోసం ఓ సందేశాత్మక కథ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ కథలు సందేశంతో కూడుకున్నవి అయినా మాస్ ఆడియన్స్ కేకలు పెట్టే ఎలిమెంట్స్ ఆయన చిత్రాల్లో ఉంటాయి.

కుదిరిన ముహూర్తం
కొరటాల, చిరు మూవీ సంక్రాంతి రోజు ప్రారంభం కానున్నట్లు తాజగా వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి సినిమాని లాంచ్ చేసి ఆ తరువాత మరికొన్ని రోజుల్లోనే సినిమాని సెట్స్ పైకి తీసుకుని వెళ్లేలా కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాంచరణ్ వదులుతాడా
చిరంజీవి 150 చిత్రం ఖైదీ నెం 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించడం విశేషం. ప్రస్తుతం రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి చిత్రానికి కూడా రాంచరణే నిర్మాత. కొరటాల శివ చిత్రాన్ని కూడా రాంచరణే నిర్మిస్తాడా లేక బయటవాళ్ళకు అవకావం ఇస్తాడా అనేది చూడాల్సి ఉంది.

సోషల్ మెసేజ్
కొరటాల శివ ఈ చిత్రాన్ని కూడా సామజిక అంశాల నేపథ్యంలో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాల్ని మించేలా కొరటాల ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











