బైరెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి.. ఆ దర్శకుడు ఫిక్స్ అయినట్లేనా?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఆయన సరికొత్త యాక్టింగ్ స్కిల్ తోనే అంచనాలను పెంచేయగలరు. రానున్న ఐదేళ్లలో మెగాస్టార్ వీలైనన్ని సినిమాలు చేయాలని టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ ఆరు పదుల వయసులో కూడా జెట్ స్పీడ్ లో వర్క్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకు సినిమాలు అంటే ఎంత ఇష్టమో.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్యను ముగించే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమాను స్టార్ట్ చేసి లుసిఫర్ రీమేక్ ను కూడా ఫినిష్ చేయాలని భావిస్తున్నారు. మొదట ఆ రీమేక్ కోసం సుజిత్, వినాయక్ లను అనుకున్నప్పటికి అనుకోని కారణాల వల్ల మార్చక తప్పలేదు. చివరికి తని ఒరువన్ దర్శకుడు మోహన్ రాజాను ఫిక్స్ చేశారు. సినిమాలో మెగాస్టార్ బైరెడ్డి అనే పాత్రలో నటించనున్నాడట. రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో మాఫియాను కూడా మిక్స్ చేసి పాత్రను డిజైన్ చేసినట్లు టాక్.

మెగాస్టార్ చిరంజీవికి కూడా దర్శకుడి ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందరికి తెలిసిన కథే అయినప్పటికి మేకింగ్ లో మాత్రం చాలా కొత్తగా ఉండాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను ఆచార్య సినిమా షూటింగ్ ముగిసిన తరువాత మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ని కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











