మెగాస్టార్ చిరంజీవి రీమేక్ మూవీ.. అవన్నీ అబద్ధాలేనట.. ముహూర్తం ఫిక్స్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా స్టార్ట్ చేసిన కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటారు. ప్రస్తుతం ఆయన లైన్ లో పెట్టిన సినిమాలను కూడా ఎలాగైనా పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ముందుగా కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే తుది దశలో ఉన్న ఆచార్య షూటింగ్ పనులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.
థియేటర్స్ అయితే ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా లేవు. ఇక ఆచార్య విడుదలపై కూడా ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు. ఇక ఆ సినిమా రిలీజ్ ఆలస్యం అయినా సరే కూడా లాక్ డౌన్ అనంతరం వెంటనే మరొక సినిమాను స్టార్ట్ చేయాలని ముహూర్తం ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ఆ సినిమా మరేదో కాదు. లూసిఫర్ రీమేక్. రామ్ చరణ్ నిర్మాతగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇటీవల కొన్ని ఊహించని రూమర్స్ వైరల్ అయ్యాయి.

దర్శకుడు కథను సరైన క్రమంలో సెట్ చేసుకోలేదని మెగాస్టార్ అభ్యంతరం చెప్పడంతో మోహన్ రాజా డ్రాప్ అయినట్లు గాసిప్స్ బాగానే వచ్చాయి. ఇక అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మోహన్ రాజా స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ చాలా సంతృప్తి చెందినట్లు సమాచారం. ఇక లాక్ డౌన్ పూర్తయిన వెంటనే సినిమాను లాంచ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే దర్శకుడు హీరోయిన్, నటీనటుల సెలక్షన్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక మెగాస్టార్ తో మరొకసారి మాట్లాడి తుది నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఎలాగైనా వచ్చే ఏడాది ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మెగాస్టార్ అడుగులు వేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











