విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్? బాస్ ఎప్పుడొస్తున్నాడంటే?
మెగాస్టార్ చిరంజీవి మల్లిడి వశిష్ఠ కాంబినేషన్ లో గ్రాండ్ స్కేల్లో 'విశ్వంభర' చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం మెగా అభిమానులే కాకుండా నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చివరిగా మెగాస్టార్ 'భోళా శంకర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ ఎలాగైనా తన అభిమానులను, తెలుగు ప్రేక్షకులను ఖుషి చేయాలని మెగాస్టార్ అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే తన రాబోయే చిత్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రం 'విశ్వంభర'. ఈ చిత్రంతో పదేళ్ల తర్వాత మరోసారి త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో చిరు, త్రిష పెయిర్ గా 'స్టాలిన్' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ విత్ యాక్షన్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు మార్కెట్ లోనూ ఈ ప్రాజెక్ట్ కు మంచి డిమాండ్ ఉండింది. మెగాస్టార్ 156వ చిత్రంగా వస్తున్న 'విశ్వంభర' ఏడాదిన్నరగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈచిత్రం రిలీజ్ డేట్ ఎప్పుడనేది చాలా రోజులుగా ప్రశ్నార్థకంగా మారింది.

అయితే ఈ ఏడాది 2025 సంక్రాంతి కానుకగానే రావాల్సి ఈ చిత్రం ఎందుకో వాయిదా పడింది. అయితే... ఎట్టకేళలకు మళ్లీ రిలీజ్ డేట్ విషయంపై 'విశ్వంభర' టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు రిలీజ్ డేట్స్ ను పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అందులో ఒకటి మే 9, 2025. సమ్మర్ హాలీడేస్ లో బాస్ ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపబోతున్నాడని తెలుస్తోంది. అప్పడైతే రీచ్ తోపాటు బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా అదిరిపోతాయని టీమ్ అంచనా వేస్తుందని తెలుస్తోంది.
మరోవైపు ఆగస్టు 22 అని కూడా ప్రచారంలో ఉంది. ఈ డేట్ చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు. ఎందుకంటే ఆ రోజు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కావడం విశేషం. ఆ స్పెషల్ డేన 'విశ్వంభర'ను రిలీజ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారంట. పైగా సినిమాలకు ఆగస్టు రిలీజ్ కూడా బాగుంటుందని, మార్కెట్ పరంగా, బాక్సాఫీస్ పరంగానూ అన్ని లెక్కలు సరిపోతాయని అంచనా వేస్తున్నారంట. అలాగే విశ్వంభరను మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నాంట. భారీ విజువల్ ఎఫెక్ట్స్, సీజీఐ, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తో తీసుకురాబోతున్నారంట.
మెగాస్టార్ వింటేజ్ క్రేజ్ ను తీసుకొచేందుకు అనుగుణంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక సీన్ కోసమే రూ.12 కోట్ల వరకు నిర్మాతలు వెచ్చిస్తున్నారంటే ఏ రేంజ్ లో మూవీ ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కునాల్ కపూర్, యంగ్ బ్యూటీ ఆషీకా రంగనాథ్, రావు రమేశ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత 'దసరా' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, అలాగే అనిల్ రావిపూడితో క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











