Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
ఆ రీమేక్ సినిమా కోసం మెగాస్టార్ న్యూ లుక్.. రెండు టైటిల్స్ కూడా..
కరోనా లేకపోయి ఉంటే మెగాస్టార్ చిరంజీవి నుంచి ఈ పాటికి రెండు సినిమాలు వెనువెంటనే రిలీజ్ అయ్యేవి. అలాగే మరో రెండు సినిమాలు కూడా దాదాపు రిలీజ్ కు సిద్ధంగా ఉండేవి. జెట్ స్పీడ్ లో ఉండగా అనుకోకుండా కరోనా వల్ల బ్రేక్ పడింది. సెకండ్ వేవ్ కూడా మొదలవ్వడం వలన మెగాస్టార్ ఆచార్య మరోసారి వాయిదా పడబోతున్నట్లు టాక్ వస్తోంది.
ఇక మెగాస్టార్ లైన్ లో పెట్టిన మిగతా సినిమాల షూటింగ్స్ కు కూడా బ్రేక్ పడేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. అయితే ఇటీవల లూసిఫర్ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ నగర్ లో వైరల్ గా మారింది. అదేమిటంటే.. మెగాస్టార్ సినిమా మొత్తం ఒకే రకమైన లుక్కుతో కనిపిస్తారట. పంచె కట్టుతో కోర మీసాలతో మాస్ ఆడియెన్స్ విజిల్స్ వేసేలా లుక్ ను డిజైన్ చేసినట్లు సమాచారం.
దర్శకుడు మోహన్ రాజా మెగాస్టార్ స్టైల్ కు తగ్గట్లుగానే స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు సమాచారం. మెగాస్టార్ కూడా అతని ప్లాన్ కు ఫిదా అయినట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే.. రెండు విభిన్నమైన టైటిల్స్ ను అనుకుంటున్నట్లు సమాచారం. అన్న, లేదా కింగ్ మేకర్.. అనే టైటిక్స్ చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి టైటిల్ పై కూడా క్లారిటీ ఇవ్వాలని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.